ఎపిసోడ్ 13 ( ఆగస్టు 2) హైలైట్స్: ఎమోషనల్ అయిన ఇంటి సభ్యులు

Akkineni Nagarjuna, Baba Master, Bigg Boss, Bigg Boss Episode 13, Bigg Boss Season 3 Telugu, Bigg Boss Season 3 Telugu Episode 13 Highlights, Bigg Boss Telugu, Bigg Boss Telugu 3, Bigg Boss Telugu 3 Highlights, Bigg Boss Telugu 3 Latest, Hema, Highlights Of Bigg Boss Telugu 3, Highlights Of Bigg Boss Telugu 3 Episode 13, himaja, Jaffar, Mango News Telugu, punarnavi, Rahul, Ravi, Rohini, Sreemukhi, Tammanah Simhadri, Varun Sandesh, Vithika

గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. మొదటగా హేమ ఎలిమినేట్ అయ్యింది, తరువాత తమన్నా సింహాద్రి అనే ట్రాన్స్‌జెండర్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి రావడంతో మళ్ళీ ఇంటిలో 15 మంది సభ్యులు ఉన్నారు. ఆగస్టు 2న ప్రసారమైన బిగ్ బాస్ 3 పదమూడో ఎపిసోడ్ లో ఇంటి సభ్యులు అందరూ తమ జీవితంలో ఎదురుకున్న సంఘటనలు పంచుకున్నారు, దీంతో ఎపిసోడ్ భావోద్వేగంగా సాగింది.

ఎపిసోడ్ 13 ( ఆగస్టు 2) హైలైట్స్: ఎమోషనల్ అయిన ఇంటి సభ్యులు

 • కెప్టెన్ అయిన వరుణ్ సందేశ్ ఇంటి సభ్యులకు పనులను కేటాయించాడు
 • ఇంటిలో ఎలా నడుచుకోవాలో వితికా, వరుణ్ సందేశ్ కి వివరించింది, సభ్యులను ఇంగ్లీష్ మాట్లాడకుండా చూసుకోమని చెప్పింది
 • కెప్టెన్ ఎంపిక గురించి కొంతమంది తనకు ఎందుకు ఓట్లు వేయలేదని అలీరేజా, మహేష్ విట్టా తో చర్చించాడు
 • ఉదయం టాప్ లేచిపోద్ది సాంగ్ ప్లే అవ్వగా ఇంటి సభ్యులు డాన్స్ చేసారు
 • లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇంటికి ఇచ్చే సామాన్లపై వరుణ్ సందేశ్ ఇంటి సభ్యుల సలహాలు తీసుకున్నాడు
 • రోహిణి, రవికృష్ణ, సావిత్రి ట్రిపుల్ ఎక్స్ సోప్ టాస్క్ లో బట్టలు ఉతికి 3,350 లగ్జరీ పాయింట్స్ గెలుపొందారు
 • పునర్నవి భూపాలంను డేట్ కి వస్తావా అంటూ రాహుల్ సరదాగా అడగగా, అసలు నా రిలేషన్ షిప్ స్టేటస్ గురించి అడగవా అంటూ పునర్నవి కౌంటర్ ఇచ్చింది, ఎవరు అతను అని రాహుల్ మళ్ళీ అడగగా, అవన్నీ సీక్రెట్ అని చెప్పింది
 • తమ జీవితంలో జరిగిన సంఘటనలను, మళ్ళీ జరగ కూడదని కోరుకునే విషయాలను ఇంటి సభ్యులతో పంచుకోమని బిగ్ బాస్ కోరగా ఒక్కొక్కరు భావోద్వేగంగా వాళ్ళు జీవితంలో ఎదురుకున్న సంగతులు పంచుకున్నారు
 • అలీరేజా తన భార్యతో వెళ్తున్నప్పుడు జరిగిన యాక్సిడెంట్ సంఘటన గురించి చెప్పాడు
 • జాఫర్ తన అక్కకు సంబంధించిన జ్ఞాపకాలు పంచుకున్నాడు
 • రోహిణి తనకు జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్పింది
 • రవికృష్ణ తన హీరో అవ్వాలనుకోవడం, సీరియల్స్ నటించడం, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పాడు
 • మహేష్ విట్టా తన స్నేహితుణ్ని కోల్పోయిన సందర్భాన్ని వివరించాడు
 • బాబా భాస్కర్ తన కుటుంబ సభ్యుల గురించి చెప్పి ఇంటి సభ్యులను ఏడిపించాడు
 • శ్రీముఖి తన తాత గురించి చెప్పి కన్నీరు పెట్టుకుంది
 • హిమజ వాళ్ళ అమ్మతో ఉన్న సంబంధం గురించి చెప్పింది
 • సావిత్రి తన ప్రేమ కధ చెప్పేసి ఏడ్చేసింది
 • రాహుల్ కూడా తన ప్రేమ కథ వివరించాడు
 • పునర్నవి భూపాలం తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి చెప్పింది
 • వితికా, వరుణ్ సందేశ్ దంపతులు వారి ప్రేమ గురించి, వారి కుటుంబసభ్యుల గురించి మాట్లాడారు
 • ఎనిమిదిమంది ఇంటి సభ్యులు ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఉండడం, ఈ రోజు నాగార్జున ఎంట్రీ ఉండడంతో శనివారం ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here