పవన్, చంద్రబాబు భేటీ.. జనసేనకు కేటాయించబోయే స్థానాలపై చర్చ

Pawan Chandrababu Meet Discussion on Seats to be Allotted to Janasena,Pawan Chandrababu Meet,Discussion on Seats to be Allotted,Seats to be Allotted to Janasena,Janasena, TDP, Chandrababu naidu, Pawan kalyan, AP Assembly Elections,Mango News,Mango News Telugu,Janasena Allotted Seats Latest News,Janasena Allotted Seats Latest Updates,Janasena Allotted Seats Live News,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
Janasena, TDP, Chandrababu naidu, Pawan kalyan, AP Assembly elections

ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ.. ఈసారి ఎలాగైనా సీఎం కుర్చీ దక్కించుకోవాలని తహతహలాడుతోంది. అందుకోసమే ఈసారి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది. వైసీపీ సర్కార్‌ను కూల్చేయడమే ధ్యేయంగా.. అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ పలుమార్లు చంద్రబాబు ఇంటికి వెళ్లి సమావేశమయ్యారు. అయితే ఈసారి సీన్ రివర్స్ అయింది. చంద్రబాబు నాయుడే.. పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు.

హైదరాబాద్‌లోని పవన్ ఇంటికి ఆదివారం చంద్రబాబు నాయుడు వెళ్లారు. తాజా రాజకీయ పరిణామాలు.. ఎన్నికల వేళ అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు జనసేనకు కేటాయించబోయే సీట్ల ఎంపిక గురించి ప్రధానంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో.. సీట్ల ఎంపికపై ఓ క్లారిటీకి వచ్చినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.  మొత్తం 28 స్థానాలను జనసేనకు కట్టబెట్టేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఆ 28లో జనసేనకు అత్యంత కీలకమైన స్థానాలు కూడా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

జనసేనకు కేటాయించిన స్థానాలు అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలోనే ఉన్నాయట. రాజోలు, పి. గన్నవరం స్థానాలు జనసేకు కూటాయించారట. అయితే ఆ రెండింటింలో ఒక స్థానం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో ఆ రెండు స్థానాలను జనసేనకు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. గొల్లపల్లి సూర్యారావు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. అటు భీమిలి నుంచి పోటీ చేసేందుకు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఆ స్థానాన్ని కూడా జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది.

అటు రాజమండ్రి రూరల్‌ను కూడా జనసేనకు కేటాయించారట. ఇక్కడి నుంచి జనసేన నేత కందుల దుర్గేష్ పోటీ చేయనున్నారని తెలుస్తోంది. అయితే పోయినసారి ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. మరి ఈసారి ఈ టికెట్ ఆయనకు ఇవ్వకుండా జనసేనకు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. మరి బుచ్చయ్యకు ఈసారి టికెట్ దక్కుతుందా..? ఒకవేళ టికెట్ ఇస్తే ఏ స్థానం నుంచి బరిలోకి దింపుతారనేది చర్చనీయాంశంగా మారింది.

ఇక జనసేనకు కేటాయించిన 28 స్థానాలకు సంబంధించి జాబితా ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ జాబితాలో గాజువాక, భీమిలి, నెలిమర్ల, యలమంచిలి, పాడేరు, రాజమండ్రి రూరల్, రాజానగరం, పిఠాపురం, కాకినాడ రూరల్, రాజోల్, పి.గన్నవరం, భీమవరం, తాడేపల్లి, నరసాపురం, నిడదవోలు, ఉంగుటూరు, కొవ్వూరు, తణుకు, విజయవాడ వెస్ట్, అవనిగడ్డ, తెనాలి, గుంటూరు, పెడన, నెల్లూరు, మదనపల్లి, దర్శి, తిరుపతి, గిద్దలూరు స్థానాలు ఉన్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =