విశాఖ పర్యటనలో ఏపీ గవర్నర్

Biswa Bhusan Governor of AP On A Two Day Visit To Visakhapatnam,Biswa Bhusan Harichandan,YS Jagan Met Biswa Bhusan Harichandan,AP Governor Biswa Bhusan Harichandan,AP Latest News,AP Politics,AP Political News,AP Political Updates,YCP Latest News,YSRCP,TDP,Mango News Telugu,Biswa Bhusan Governor of AP,Biswa Bhusan,Biswa Bhusan AP governor,Visakhapatnam, AP Governor Biswabhusan Harichandan Visiting Vizag Today

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విశాఖపట్నంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఏపీ గవర్నర్‌ విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో జూలై 31న విశాఖపట్నం చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, నగర పోలీసు కమిషనర్ మీనా, నేవీ అధికారులు గవర్నర్ కు స్వాగతం పలికారు. గవర్నర్ రెండు రోజుల పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ పర్యవేక్షిస్తున్నారు, జూలై 30న, సర్క్యూట్ హౌస్‌ను సందర్శించి, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు, తరువాత కైలాసాగిరిలోని తెలుగు మ్యూజియంలో ఏర్పాట్లను పరిశీలించారు.

గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విశాఖపట్నంలో జూలై 31 మరియు ఆగస్టు 1వ తేదీలలో ఉంటారు. జూలై 31న ఈస్టర్న్ నేవల్ కమాండ్, కైలాసాగిరిలోని తెలుగు మ్యూజియం,మరియు వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్ సందర్శిస్తారు. ఆగస్టు 1వ తేదీన బిశ్వ భూషణ్ హరిచందన్ విశాఖపట్నం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించి వీసీతో భేటీ అవుతారు మరియు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్‌లో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలిస్తారు. మళ్ళీ ఆగస్టు 1న 7:40 నిముషాలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం నుండి విజయవాడకు చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా నియామకం అయిన తరువాత రాష్ట్రంలో బిశ్వ భూషణ్ హరిచందన్ మొదటి అధికారిక పర్యటన చేస్తున్నారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here