చినజీయర్ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్

#KCR, chinna jeeyar swami, Chinna Jeeyar Swamy, CM KCR, CM KCR Meets Chinna Jeeyar Swamy, kcr meets chinna jeeyar swamy, latest news, Mango News Telugu, telangana, Telangana CM KCR, Telangana Latest News, Telangana News, telangana political news.telangana politics, telangana updates, telugu news

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతలలో గల ఆశ్రమంలో చినజీయర్ స్వామిని కలిసారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను పూర్ణకుంభంతో ఆశ్రమంలోకి ఘనంగా స్వాగతం పలికారు. మధ్యాహ్నం ఆశ్రమానికి చేరుకున్న కేసీఆర్ దాదాపు రెండున్నర గంటల పాటు చినజీయర్ స్వామితో చర్చలు జరిపారు. త్వరలో యాదాద్రిలో మహా సుదర్శన యాగం చేయాలనీ సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. తెరాస ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు. అక్కడ జరుగుతున్న పనులన్నీ ముగింపు దశకు చేరుకోవడంతో త్వరలో యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహణపై చినజీయర్ స్వామితో చర్చించినట్టు సమాచారం.

దాదాపు 1000 ఎకరాల ప్రాంగణంలో, 1048 యజ్ఞ కుండాలతో ఈ యాగం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిపారు. 3 వేలమంది రుత్విక్కులు, మరో 3 వేలమంది సహాయకులతో యాగం నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాల మఠాధిపతులను, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మరియు కేంద్రంలో ఉన్న ముఖ్యనేతలు, అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులను, మంత్రులను ఈ మహా సుదర్శన యాగానికి ఆహ్వానించనున్నారు. అతిధులు, భక్తులు ఎక్కువుగా వచ్చే అవకాశం ఉండడంతో ఏర్పాట్లపై చినజీయర్ స్వామితో సీఎం కేసీఆర్ చర్చించారు. చినజీయర్ స్వామిని కలిసిన వారిలో సీఎం కేసీఆర్ తో పాటు జూపల్లి రామేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ఉన్నారు.

 

 

[subscribe]
[youtube_video videoid=Rksm1K7KgHc]

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + two =