ఓటమితో ఎవరు నా వాళ్ళో అర్థమైంది

Pawan Kalyan Speech In Party Office,Pawan Kalyan,Pawan Kalyan,Janasena, Janasena Party,Pawan Kalyan Janasena Party,Pawan Kalyan Speech,Pawan Kalyan Latest Speech,janasena chief, pawan kalyan latest news, jana sena, pawankalyan, janasenani

పార్టీకోసం పని చేస్తున్న అభిమానులకు, కార్యకర్తలకు అండగా నిలబడతానని, ఎవరు భయపడకండి అని పవన్ కళ్యాణ్ ఈ రోజు జనసైనికులకి అభయం ఇచ్చారు. పార్లమెంట్ నియోజక వర్గాల సమావేశం సందర్భంగా, రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సమర్థత లేని నాయకుల వలనే ఓటమిపాలయ్యామని, అన్ని నియోజక వర్గాల్లో చేసిన తప్పులు, ఓటమికి కారణాలు వెతకాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ విజయం కోసం అహర్నిశలు పని చేసిన కార్యకర్తలకు అందరకీ కృతజ్ఞతలు చెప్పారు. త్వరలో నియోజక ఇన్‌చార్జిల జాబితాను ప్రకటిస్తామని, ఇక గ్రామ, మండల స్థాయి కమిటీలను వారే పర్యవేక్షిస్తారనీ తెలిపారు.

త్వరలో భీమవరం వస్తానని, రెండు రోజుల పాటు ప్రజలకి, నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. తరువాత ఒక్కో నియోజక వర్గాన్ని ఎంచుకుని కార్యకర్తలను కలుసుకుంటానని చెప్పారు. తన దగ్గర డబ్బులేదని, కేవలం ఆశయాలతో జనసేన పార్టీ స్థాపించానని, ఎదో ఒక రోజు దేశమంతా మన వైపు చూసేలా చేస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గడిచిన ఎన్నికలలో ఓడిపోయాకే, ఎవరు తన వాళ్ళో అర్థమైందని చెప్పారు. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వడం ఎందుకని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ప్రశ్నించారు. కొన్ని చోట్ల అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థులను నియోజకవర్గ ఇన్‌చార్జిలగా నియమిస్తామని, వీరు మరింత సమర్థవంతంగా పని చేసే పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.

 

[subscribe]
[youtube_video videoid=pdPTGeGGkxw]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =