ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు (సబ్జెక్టు టీచర్లకు) బోధనా పద్ధతులపై ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్సులు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ జవహర్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, మౌలిక వసతుల కమిషనర్ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారికి పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
విద్యాశాఖపై సమీక్షలో సీఎం జగన్ చేసిన కొన్ని ముఖ్యమైన సూచనలు, ఆదేశాలు..
- పాఠశాలల్లో డ్రాప్ అవుట్ తగ్గించాలి. అలాగే పాఠశాలలకు వస్తున్న విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలి.
- సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్ధాయిలో విద్యాశాఖ ఇప్పటికే సినర్జీతో ఉంది. దీనిని మరింత సమర్ధవంతంగా వాడుకోవాలి.
- పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తుంది. అయినా పిల్లలు బడికి రాని పక్షంలో తల్లిదండ్రులను ఆరా తీస్తున్నారు.
- ఇంటర్ వరకు అమ్మ ఒడి.. ఆపై విద్యాదీవెన, వసతి దీవెన పథకాలతో విద్యార్థులకు ప్రతి దశలో అండగా ఉంటున్నాం.
- వచ్చే విద్యాసంవత్సరంలో విద్యాకానుక కింద విద్యార్థులకు పంపిణీ చేయాల్సిన పుస్తకాల ముద్రణ ముందుగానే పూర్తిచేయాలి.
- సబ్జెక్టు టీచర్లకు బోధనా పద్ధతులపై ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్సులు ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్.
- మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో బోధనా పద్ధతుల్లో నైపుణ్యాలను పెంచేలా కోర్సులను నిర్వహణ.
1998 డీఎస్సీ అభ్యర్థులకు ఈ వేసవిలో శిక్షణా తరగతులు నిర్వహించాలి. - పిల్లల సంఖ్యకు తగినట్టుగా సమీక్ష చేసుకుని వారి అవసరాలకు అనుగుణంగా టీచర్లను నియమించాలి.
- జూన్ నాటికి తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలి.
- 3 నుంచి 5 గ్రేడ్ల ప్రైమరీ విద్యార్థులకు టోఫెల్ పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి టోఫెల్ ప్రైమరీ సర్టిఫికెట్ అందించాలి.
- అలాగే 6 నుంచి 10 గ్రేడ్ల వారికి మూడు దశల్లో జూనియర్ స్టాండర్డ్ టోఫెల్ పరీక్షలు నిర్వహించాలి.
- ప్రైమరీ స్థాయిలో లిజనింగ్, రీడింగ్ నైపుణ్యాల పరీక్షలు ఉంటాయి.
- జూనియర్ స్టాండర్డ్ స్ధాయిలో లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్ నైపుణ్యాల పరీక్షలు నిర్వహిస్తారు.
- ఈ పరీక్షలకోసం విద్యార్థులను, టీచర్లను సన్నద్ధం చేసేలా ఇ– కంటెంట్ రూపొందించాలి.
- ఇక ఇప్పటికే విద్యార్థులకు అందించిన ట్యాబులకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే మరమ్మతు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలి.
- దీనిపై తక్షణమే ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక ఫిర్యాదు నంబరును స్కూల్లో ఉంచాలి.
- ఇక ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్ పూర్తిస్థాయిలో చేయాలి.
- ఇప్పటికే వేయి ప్రభుత్వ స్కూళ్లు అఫిలియేట్ అయ్యాయని, మిగిలిన స్కూళ్లు కూడా త్వరలో చేసేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE