ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 21, మంగళవారం నాడు పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తణుకులో జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ముందుగా మంగళవారం ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్ లో సీఎం బయలుదేరి, 11 గంటలకు తణుకు చేరుకోనున్నారు. అనంతరం తణుకులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొని, జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభిస్తారు.
అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం ముగిసాక మధ్యాహ్నం 1.50 గంటలకు సీఎం తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు. తణుకులో సీఎం పర్యటన నేపథ్యంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు, ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం ఇప్పటికే ఏర్పాట్లను పర్యవేక్షించి, అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ







































