ఇప్పటం గ్రామానికి చేరుకున్న పవన్ కళ్యాణ్, ఇళ్ల కూల్చివేతపై గ్రామస్తులతో సమావేశం

Janasena Chief Pawan Kalyan Reached Ippatam Village Held Meeting with People over Houses Demolition Issue, Pawan Kalyan to Discuss Houses Demolition Issue, Janasena President Pawan Kalyan To Visit Ippatam Village, Ippatam Village Houses Demolition Issue, Ippatam Houses Demolition Issue, Houses Demolition Issue, Ippatam Village, Janasena President Pawan Kalyan, Pawan Kalyan, Ippatam Houses Demolition Issue News, Ippatam Houses Demolition Issue Latest News And Updates, Ippatam Houses Demolition Issue Live Updates, Pawan Kalyan Twitter News, Pawan Kalyan Latest News, Mango News, Mango News Telugu

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం ఉదయం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. కాగా పవన్ కళ్యాణ్ ఇప్పటం చేరుకోవడం ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగింది. ముందుగా ఇప్పటం వెళ్లకుండా పవన్ కళ్యాణ్ ను మంగళగిరిలోని పార్టీ కార్యాలయం ముందే పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ అడ్డుకోవడంతో పార్టీ నాయకులు, శ్రేణులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకుంది. దీంతో పవన్ కళ్యాణ్ వాహనం దిగి నడుచుకుంటూ, కాలినడకనే ఇప్పటం వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొంత దూరం వెళ్లాక పవన్ కళ్యాణ్ తిరిగి తన వాహనం పైకెక్కి ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు. ఇప్పటంలో కూల్చివేసిన ఇళ్లను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నారు. ఇళ్ల కూల్చివేతపై గ్రామస్తులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా బాధితులను పరామర్శించి, వారికీ పవన్ కళ్యాణ్ తన సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఇప్పటం గ్రామంలో రోడ్లు విస్తరణ చేస్తే, ఇడుపులపాయలో హైవేలు వేస్తామని అన్నారు. ఇప్పటం ఏమైనా కాకినాడ లేక రాజమహేద్రవరమా? రోడ్లు వెడల్పు చేయడానికి? మార్చిలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు స్థలం ఇచ్చారని, ఏప్రిల్ లో రోడ్లు వెడల్పు అంటూ జీవో ఇచ్చారు, ఇది కక్ష సాధింపు చర్య అని పవన్ కళ్యాణ్ అన్నారు. మొన్న చెప్పు చూపిస్తే ప్రజాస్వామ్యమా అని అన్నారు, మరి అన్యాయంగా ప్రజల ఇల్లు కూల్చడం ప్రజాస్వామ్యమా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మరోవైపు పవన్‌ పర్యటన నేపథ్యంలో ఇప్పటం గ్రామంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ముందుగా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరిట 53 ఇళ్లు, ప్రహరీలను శుక్రవారం కూల్చివేసిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ప్రాంగణం ఇచ్చామనే కక్షతోనే రోడ్డు విస్తరణ పేరిట ఇప్పటంలో తమ ఇళ్లను వేస్తున్నారని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రికి పవన్ కళ్యాణ్ మంగళగిరి చేరుకొని, శనివారం ఉదయం ఇప్పటం ప్రజలను కలవాలని నిర్ణయించుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =