అమరావతి: 2024 సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో జగన్, చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్నారు. అస్త్రసస్త్రాలు సంధించి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు.అయితే ఈ ఎన్నికలలో తన త్యాగనిరతితో సరికొత్త రాజకీయానికి భాష్యం చెప్పాడు పవన్ కళ్యాణ్. తన సినిమాలో చెప్పిన మాట ‘ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి’ అనే విషయాన్ని ఆచరణలో పెట్టి చూపించాడు పవన్ కళ్యాణ్.వైసిపి పాలనలో ప్రతిపక్షాల గొంతు వినిపించటానికి సైతం జంకుతున్న రోజుల్లో, ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి ఎదిరిస్తే తప్ప జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టలేం అని చాటి చెప్పిన మనిషి పవన్ కళ్యాణ్.
2021 మార్చిలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలోనే పవన్ కళ్యాణ్ కచ్చితంగా 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష ఓటు చీలన ఇవ్వాలని ప్రకటించేశారు.అప్పటికే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ చేసిన ఈ ప్రకటన రాజకీయంగా సంచలనంగా మారింది. బద్ధ శత్రువులుగా అన్న బిజెపి తెలుగుదేశం పార్టీని ఎలా కలపగలరు అంటూ అనేక ప్రశ్నలు వినిపించాయి.
ఇక 2023 సంవత్సరంలో చంద్రబాబు అరెస్టు తర్వాత ప్రతిపక్షాలు తమ వాడిని వినిపించాలంటేనే భయపడుతున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఓ మలుపు తిప్పింది. ఓవైపు బిజెపితో పొత్తులో ఉంటూనే రాష్ట్ర భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తెలుగుదేశం జనసేన కలిసి 2024 ఎన్నికల్లో పోటీకి దిగుతాయని పవన్ ప్రకటించేశారు.
అయితే ప్రతి సందర్భంలో రాష్ట్ర అవసరాల దృష్ట్యా తీసుకున్న తన నిర్ణయానికి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఆమోదించి తమతో కలిసి వస్తుందనే నమ్మకం అనే పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు.సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు 2024 ఫిబ్రవరిలో తన మాట ప్రకారం ప్రతిపక్ష ఓటు చీలనివ్వకుండా టిడిపి-బిజెపి-జనసేన పొత్తుకు పవన్ కళ్యాణ్ మార్గం సుగమనం చేశారు.
రాష్ట్రంలో కనీసం ఒక్క శాతం కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీ కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారు అనే ప్రశ్న పదే పదే వినిపించిన, జాతీయస్థాయిలో బిజెపి అండదండలు లేకపోతే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడదని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక ఇక బిజెపిని పొత్తుకు ఒప్పించడానికి తన పార్టీకి వస్తాయని భావించిన మూడు ముఖ్యమైన అసెంబ్లీ సీట్లను పొత్తులో వదులుకుని అతిపెద్ద త్యాగానికి పవన్ కళ్యాణ్ పూనుకున్నారు.
పవన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మొదట్లో జనసైనికులు సైతం కోపాన్ని వ్యక్తం చేసినప్పటికీ, రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆయన ఏ విధమైన త్యాగానికి సిద్ధపడ్డాడో తెలుసుకుని తిరిగి పవన్ కు జై కొట్టారు.బిజెపి అధినాయకత్వం, ప్రధాని నరేంద్ర మోడీ సైతం పవన్ కళ్యాణ్ కు పెద్దపీట వేయడం చూస్తుంటే కచ్చితంగా పవన్ త్యాగానికి సార్ధకత లభించినట్టే అనిపిస్తుంది.
ఒకటి అరా సీట్ల కోసం హత్యలకు తెగబడుతున్న రాజకీయాన్ని చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు.. రాష్ట్ర శ్రేయస్సు కోసం తన పార్టీ భవిష్యత్తును పణంగా పెట్టిన పవన్ కళ్యాణ్ త్యాగాన్ని చూడటం కొంత ఆశ్చర్యంగా కొత్తగానే కనిపించొచ్చు.
అమరావతి నిర్మాణం జరగాలన్న, తాడి తప్పిన పరిపాలన సక్రమమైన మార్గానికి రావాలన్న, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలన్నా రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి లేని సుస్థిరమైన ప్రభుత్వంకావాలని పదే పదే చెబుతున్నారు. ఈ సంకేతాలన్నీ చూస్తే ఎన్నికల తరువాత పవన్ వేసే ప్రతి అడుగు రాష్ట్ర భవిష్యత్తును మెరుగుపరిచే విధంగానే ఉంటుందనేది స్పష్టంగా అర్థం అవుతుంది.
తనపై అనేక విమర్శలు చేస్తున్న వైసీపీని ఓ చిన్న చిరునవ్వుతో ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్, ఆ విమర్శలను కచ్చితంగా స్వాగతిస్తానని చెప్తున్నారు. అధికారపక్షం తనని విమర్శించకపోతే ఆశ్చర్యపోతానని పవన్ చెప్తున్నారు. సంస్కారహీనమైన విమర్శలు చేస్తున్న వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్తారని పవన్ అని చెప్తున్నారు.మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో పవన్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY