సుప్రీంకోర్టులో రాజధాని అమరావతి కేసు.. విచారణ నుంచి తప్పుకున్న సీజేఐ లలిత్, వేరే బెంచ్‌కు బదిలీ

Supreme Court Chief Justice UU Lalit Transfers The Hearing of Amaravati Capital Case To Another Bench, Supreme Court Chief Justice, Supreme Court UU Lalit, Amaravati Capital Case, Mango News, Mango News Telugu, Hearing of Amaravati Capital Case, Three Capitals of AP, Amaravati Farmers, Maha Padayatra, AP Three Capitals, Andhra Pradesh News, AP CM YS Jagan Mohan Reddy, YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలని, ఆ ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలన్న హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై చేపట్టిన విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాగా మంగళవారం ఈ కేసును చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించాల్సి ఉండగా, అనూహ్యంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ కేసు విచారణ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏపీ విభజన చట్టం అంశంపై ఇప్పటికే తన అభిప్రాయాన్ని తెలిపినందున తాను కేసు విచారణ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ కేసును వేరే బెంచ్ ముందు విచారించాలని, వీలైనంత త్వరగా విచారణకు అనుమతించాలని జస్టిస్ లలిత్ సూచించారు. దీంతో ఈ కేసు విచారణను మరో బెంచ్‌కి బదిలీ చేస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ కేసు వేరే బెంచ్ ముందు విచారణకు రానుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =