అధికారంలోకి వచ్చాక వాళ్ల పని పడతామన్న లోకేష్

Uttarandhra,Lokesh, congress, TDP, YCP, Janasena, Cpi, Cpm, TDP Leaders, Anantapur, Srikakulam, V. Vijaysai Reddy,AP Politics, Mango News Telugu, Mango News
Uttarandhra,Lokesh, congress, TDP, YCP, Janasena, Cpi, Cpm,

వైసీపీకి చెందిన ఇద్దరు అక్రమార్కులు ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన శంఖారావం సభలో మాట్లాడిన లోకేష్.. టీడీపీ జెండా దింపకుండా, మడమ తిప్పకుండా, టీడీపీకి కాపలా కాసిన ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. కొంతమంది నాయకులు వచ్చారు, కొంతమంది పార్టీ మారారు.. కానీ టీడీపీకి ఎప్పుడూ అండగా నిలబడింది మాత్రం కార్యకర్తలేనని లోకేష్ చెప్పుకొచ్చారు.

ఏపీలో జగన్ పని అయిపోయిందన్న లోకేష్..31 మంది ఎంపీలను పెట్టుకొని కేంద్రం మెడలు వంచుతా అని చివరకు కేంద్రం ముందు ఆయనే లొంగిపోయాడని ఎద్దేవా చేశారు.  ఎమ్మెల్యేలను మార్చి దేశంలో ఎక్కడా లేని కొత్త పథకం తీసుకొచ్చారని, అక్కడ తరిమేసిన వాళ్లని వేరే దగ్గర తీసుకుంటారా అని లోకేష్ ప్రశ్నించారు. సొంత కార్యకర్తతోనే కొడికత్తితో పొడిపించుకున్నారన్న లోకేష్.. బాబాయ్ ని కూడా చంపేసి ఆ నిందలను తమపై వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వాటన్నిటినీ తిప్పికొట్టాల్సిన సమయం వచ్చిందన్నారు

అంతేకాకుండా  ఉత్తరాంధ్రను వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులకు సీఎం జగన్ అప్పగించారని లోకేష్ ఆరోపించారు. వారిద్దరూ పంది కొక్కుల్లా దోచేసుకుంటున్నారంటూ కాస్త ఘాటుగా విమర్శించారు. ఏపీలో ఎక్కడ భూమి కనిపించినా కబ్జా చేసేస్తున్నారని, ఎక్కడ మైన్ కనిపించినా అక్కడ తవ్వేస్తున్నారని ఆరోపించారు. అందుకే తాము  అధికారంలోకి వచ్చాక ఇలాంటివారందరి పని పడతామని హెచ్చరించారు.

శ్రీకాకుళంలో ఉన్న వైసీపీ నాయకులు ఇసుక దందాలను, భూ కబ్జాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని లోకేష్ ఆరోపించారు. యువతకు ఉపాధిని చూపించడం మరిచిపోయారని అలాగే  జిల్లా అభివృద్దిని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు తాను హామీ ఇస్తున్నానని, అనంతపూర్ కి కియా మోటార్స్ ని తీసుకొచ్చినట్లే.. ఇక్కడికి పరిశ్రమలని తీసుకొచ్చే బాధ్యత తనదని  లోకేష్ భరోసా ఇచ్చారు. సిక్కోలు అంటే కష్టపడి పనిచేసే మనుషులని, వారికి తాను ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హమీ ఇచ్చారు.

అలాగే ఇక్కడ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావుతో పాటు  ఆయన కొడుకు ఇసుక దోపిడీ తప్ప నియోజక వర్గానికి  ఏం చేశారని లోకేష్ ప్రశ్నించారు. ఈ నియోజకవర్గానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే  అభివృద్ది జరిగిందని గుర్తు చేసిన లోకేష్.. ధర్మాన మంత్రి అయ్యాక కనీసం గుంతలు కూడా పూడ్చలేదని విమర్శించారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. అంతేకాదు శ్రీకాకుళంలో జరిగిన అభివృద్దిపై చర్చకు సిద్దమా అని వైసీపీ నేతలకు లోకేష్ సవాల్ విసిరారు.  విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గతంలో టీడీపీ పరిశ్రమను తీసుకొస్తే ..ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ప్రవేటు వ్యక్తులతో ఒప్పందం చేసుకొని ప్రవేటీకరణకు సిద్దమయిందని, దానిని  తాము అడ్డగిస్తామని లోకేష్ చెప్పుకొచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE