మనసులోని కోరికను బయటపెట్టిన హరిరామ జోగయ్య

Pawan should be seen as CM Harirama Jogaiah,Pawan should be seen as CM, Harirama Jogaiah,Pawan should be seen as CM Harirama Jogaiah Wish, pawan kalyan, Janasena, TDP, Bjp,CM candidate for AP,Harirama Jogaiah Sensational Letter,Mango News,Mango News Telugu,EX Minister Harirama Jogaiah,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,Harirama Jogaiah Latest News,Harirama Jogaiah Live Updates
Pawan should be seen as CM Harirama Jogaiah Wish , Harirama Jogaiah, pawan kalyan, Janasena, Tdp, Bjp

ఏపీలో అసెంబ్లీ  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల వేడి పెరిగిపోతోంది. వైసీపీ ఇప్పటికే మూడు జాబితాలు రిలీజ్ చేసి అభ్యర్ధులను ప్రకటించి. సంక్రాంతి తర్వాత నాలుగో జాబితా కూడా విడుదల చేసి ప్రచారానికి సిద్దమవడానికి రెడీ అవుతోంది. ఇక టీడీపీ, జనసేన కూడా  అభ్యర్ధులను ప్రకటించి ప్రచారానికి తెర లేపాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.

ఓ వైపు ఇతర పార్టీల నుంచి టీడీపీ, జనసేనలోకి వస్తున్న నేతలతో పాటు..మరోవైపు వైసీపీలోకి జంప్ అవుతున్న నేతలతో పొలిటికల్ వేడితో హీటెక్కిపోతున్నాయి. ఏ నేతను ఎవరు కలిసినా.. ఏ పార్టీ ఆఫీసుకు వెళ్లి ఎవరు మీటయినా వెంటనే ఆ భేటీపైనే పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. రెండు రోజుల క్రితం జనసేన అధినేతను  కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య కలిసారంటే ఇద్దరూ ఏ విషయంపై చర్చించారంటూ పెద్ద ఎత్తున చర్చలు షురూ అయ్యాయి. అయితే దానిపై తాజాగా హరి రామ జోగయ్య నోరు విప్పారు.

ఎన్నికల గురించే తాను  పవన్ కళ్యాణ్‌తో చర్చించానని ఓ ప్రకటన ద్వారా హరిరామజోగయ్య  చెప్పారు.  ప్రస్తుత రాజకీయ అంశాలతో పాటు..ఏపీలో  నెలకొన్న  తాజా పరిస్థితులపై  సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. ఈ మధ్య పవన్ సమావేశమయ్యానని చెప్పిన ఆయన.. జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తుల అంశంపైనే  సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ఏపీలో   60 నుంచి 40 స్థానాలలో జనసేన బలంగా ఉన్నట్లు పవన్  కు చెప్పినట్లు అన్నారు అంతేకాదు 40 సీట్లకు తగ్గకుండా పోటీ చేయాలని సూచించినట్లు చెప్పారు.

అంతే కాదు ఏపీలో అధికారంలో కూడా జనసేన భాగస్వామ్యం కావాలని తాను చెప్పినట్లు హరిరామ జోగయ్య చెప్పుకొచ్చారు.దీనిపైన జనసేన కార్యకర్తలకు స్పష్టమైన హామీ కూటమి నుంచి రావాలని సూచించినట్లు చెప్పారు. మూడు పార్టీలు కలిస్తే..ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు మరింత సులువు అవుతుందని చెప్పానన్నారు.

ఇటు టీడీపీ-జనసేనతో బీజేపీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారని జోగయ్య అన్నారు. ఎందుకంటే రెండున్నర సంవత్సరాలు అయినా.. పవన్‌ని సీఎంగా చూడాలని జనసైనికులు అంతా భావిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.వీటితో పాటు అనేక అంశాలపై పవన్ కళ్యాణ్‌తో చర్చించగా… ఆయన కూడా తన అభిప్రాయాలతో ఏకీభవించారని హరిరామజోగయ్య తెలిపారు. మొత్తంగా పవన్ సీఎంగా చూడాలని అనుకుంటున్న జనసైనికుల కోరికను తన ప్రకటన ద్వారా బయటపెట్టి ఏపీ ఎన్నికల వేడిని మరింత రాజేశారు. మరి దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 1 =