వైసీపీ బీసీ చీఫ్ జంగా కృష్ణమూర్తి యాదవ్ పిలుపు

BC should Not support YCP, YCP BC chief, Janga Krishnamurthy Yadav, Jagan, Gurajala, YCP MLC, YS Jagan, assembly elections 2024, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
BC should Not support YCP, YCP BC chief, Janga Krishnamurthy Yadav, Jagan, Gurajala

వైసీపీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి యాదవ్ ఏపీ సీఎం జగన్‌పై చేసిన ఆరోపణలు రెండు  తెలుగు రాష్ట్రాలలో హాటును పుట్టించాయి.  జగన్  బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని తెరపైకి తీసుకువస్తూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై  సుమారు ఏడు నిమిషాల నిడివి ఉన్న వీడియోను జంగా విడుదల చేశారు. వైఎస్సాసీపీలో బీసీల పేరుతో ఎలా రాజకీయాలను చేస్తారో.. పదవుల పేరుతో  వారిని ఎలా బలి పశువుల్ని చేస్తారో క్లుప్తంగా వివరించడం హాట్ టాపిక్ అయింది. అయితే ఈ విషయాలు అందరికీ తెలిసినవే అయినా.. స్వంతపార్టీ నేత ఇలా పబ్లిక్‌గా కామెంట్లు చేయడంతో పొలిటికల్ కాక రేగినట్లు అయింది.

జంగా కృష్ణమూర్తి యాదవ్ 2019 ఎన్నికలకు ముందు తెలంగాణ నుంచి యాదవ నేతల్ని అందరినీ  తీసుకువచ్చి..  తన నియోజకవర్గంలో భారీ బీసీ సభను నిర్వహించారు. అంతేకాదు టీడీపీ ప్రభుత్వంపై అప్పట్లో కుల విద్వేషం రెచ్చగొట్టడానికి చేసిన ఎన్నో వ్యూహాల్లో జంగా కూడా భాగమయ్యారు. తలసాని శ్రీనివాస్  లాంటి సీనియర్ నేతలను తీసుకొచ్చి వైసీపీకి తన వంతు సాయం చేశారు. కానీ అంతచేసిన ఏపీ సీఎం జగన్.. జగన్  జంగా కృష్ణమూర్తికి  టికెట్ ఇవ్వకుండా.. కాసు మహేష్ రెడ్డికి ఇచ్చారు. జంగాకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తామని ఆశ పెట్టిన జగన్..అలాగే కాలక్షేపం చేశారు. అంతేకాకుండా గురజాలలో బీసీ  సామాజిక వర్గంలో జంగా ప్రభావం లేకుండా చేయడానికి  చేసేందుకు ఎంత చేయాలో అంతా చేశారు.

దీంతోనే జంగా కృష్ణమూర్తి కొద్ది రోజులుగా వైసీపీ అధినేత జగన్‌పై అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇక వైసీపీలో తనకు మనుగడ లేదని.. అదే పార్టీలో ఉంటే తనకు రాజకీయ భవిష్యత్ లేదని అర్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తన నియోజకవర్గంలోనే  తనను అనామకుడ్ని చేస్తున్నారన్న కోపంతో  తిరుగుబాటు ప్రారంభించారు. మొదటి నుంచి జగన్ మోహన్ రెడ్డితో కలిసి నడిచిన జంగా ఇప్పుడు ఇలా తిరుగుబాటును ప్రదర్శించారు.

నామ మాత్రపు పదవులు బీసీలకు ఇచ్చి జగన్ కీలుబొమ్మలుగా ఆడుకుంటున్నారన్న జంగా..అన్ని విధాలా బీసీలను మోసం చేస్తున్న పార్టీ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు.

పవర్ లేని పదవులను బీసీలకు ఇచ్చిన జగన్.. సామాజిక న్యాయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని జంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెత్తనమంతా తన రెడ్డి సామాజికవర్గం చేతిలో పెట్టి ..బీసీలను కీలుబొమ్మలుగా ఆడించడమే కాకుండా   బడుగు, బలహీన వర్గాల వారిని చిన్న చూపు చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను రాజకీయంగా నట్టేట ముంచేసిన పార్టీ..వైసీపీ అన్న జంగా కృష్ణమూర్తి..బీసీలెవరు కూడా ఈ ఎన్నికలలో వైసీపీకి మద్దతు తెలపొద్దని జంగా పిలుపు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + eleven =