నయనతార జంట తిరుమలలో చెప్పులు వేసుకోవడంపై వివాదం.. విఘ్నేశ్‌ శివన్‌ క్షమాపణలు

Vignesh Shivan Apologizes Controversy Over Nayanthara Wearing Sandals At Tirumada Streets in Tirumala, Vignesh Shivan Apologizes Controversy Over Nayanthara Wearing Sandals, Nayanthara and Vignesh Shivan Got Married at Mahabalipuram Resort, Heroine Nayanthara and Director Vignesh Shivan Got Married at Resort in Mahabalipuram, Heroine Nayanthara, Actress Nayanthara, Nayanthara, Director Vignesh Shivan, Vignesh Shivan, filmmaker Vignesh Shivan, Nayanthara-Vignesh Shivan wedding, Vignesh Shivan-Nayanthara wedding, Nayanthara-Vignesh Shivan Marriage, Nayanthara Wearing Sandals, Nayanthara Wearing Sandals Controversy, Vignesh Shivan Apologizes Nayanthara Wearing Sandals Controversy, filmmaker Vignesh Shivan Vignesh Shivan Apologizes Nayanthara Wearing Sandals Controversy, Tirumada Streets in Tirumala, Tirumala, Tirumada Streets, Nayanthara Wearing Sandals Controversy News, Nayanthara Wearing Sandals Controversy Latest News, Nayanthara Wearing Sandals Controversy Latest Updates, Mango News, Mango News Telugu,

తిరుమలలోని తిరుమాడ వీధుల్లో నయనతార చెప్పులు ధరించిన వివాదంపై ఆమె భర్త విఘ్నేష్ శివన్ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన సారీ చెబుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. గురువారం మ‌హ‌బ‌లిపురంలో విఘ్నేశ్ శివ‌న్‌తో దాంప‌త్య బంధంతో వైవాహిక జీవితంలో అడుగు పెట్టిన న‌య‌న‌తార  శుక్ర‌వారం భ‌ర్త‌తో క‌లిసి శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. దర్శనానంతరం కొత్త జంట ఫోటోషూట్ నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా తిరుమాడ వీధుల్లో న‌య‌న‌తార చెప్పులు ధ‌రించడంపై వివాదం చెలరేగింది.

ఈ నేపథ్యంలో.. నయనతార భర్త, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియాకు ఒక లేఖ విడుదల చేశారు. జరిగిన దానికి చింతిస్తున్నామని, అయితే ఇది కావాలని చేసింది కాదని తెలిపారు. దేవుడిపై తమకు అపారమైన భక్తి, నమ్మకం ఉన్నాయని, తాము తెలియక పొరపాటు చేశామని, మమ్మల్ని క్షమించాలని లేఖలో కోరారు. ఆ సమయంలో తమ కాళ్లకు చెప్పులు ఉన్న సంగతి గుర్తులేదని, మేము ఎంతగానో ఆరాధించే స్వామివారిని అవమానించడానికి ఇలా చేయలేదని విఘ్నేష్ పేర్కొన్నారు.

లేఖలో విఘ్నేష్ ఇంకా ఇలా చెప్పారు. అసలు తాము తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలని ఎంతోకాలంగా అనుకున్నామని, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాకపోవడంతో మహాబలిపురంలో చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. పెళ్లైన వెంటనే మండపం నుంచి నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నామని, ఇక దర్శనం అనంతరం మా పెళ్లి స్వామివారి సన్నిధిలోనే జరిగిందనే భావన కలగడం కోసం ఆలయ ఆవరణలో ఫొటోషూట్‌ చేసుకున్నామని వెల్లడించారు. అయితే దీనిపై వివాదం జరగడం దురదృష్టకరమని, తెలియక జరిగిన పొరపాటుకు అందరికీ క్షమాపణలు తెలుపుకుంటున్నామని విఘ్నేష్ తెలిపారు.

కాగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తడంతో టీటీడీ అధికారులు రియాక్ట‌య్యారు. దీనిపై టీటీడీ విజిలెన్స్ ఆపీస‌ర్ బాల్ రెడ్డి స్పందిస్తూ.. నయనతార జంటపై పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తామ‌ని చెప్పారు. అలాగే టీటీడీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఆల‌యం ముందు ఫొటోషూట్ చేశార‌ని తెలిసిందని, ఫొటో షూట్ స‌య‌మంలో అక్కడ విధుల్లో ఉన్న టీటీడీ ఉద్యోగుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామని స్పష్టం చేశారు. న్యాయ నిపుణుల‌తో సంప్ర‌దించిన త‌ర్వాత న‌య‌న‌తార‌ జంటపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని బాల్ రెడ్డి అన్నారు. మరోవైపు తిరుమ‌ల ప‌విత్ర‌తకు భంగం క‌లిగేలా వ్య‌వ‌హ‌రించిన న‌య‌న‌తార దంప‌తుల‌కు నోటీసులు ఇచ్చినట్లు టీటీడీ పీవీఎస్వో నరసింహ కిషోర్‌ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 11 =