ఏఏ కార్డులతో ఓటేయవచ్చు?

Do You Need Voter Card To Vote, Voter ID Card, Voter Card To Vote, Aadhaar Card, PAN Card, Special Disability ID Card, Bank, Post Office Pass Book, Health Insurance Smart Card, Driving License, Passport, MPs, MLAs, MLCs Issued Special Identity Cards, Employment Guarantee Job Card, Mango News, Mango News Telugu
Voter ID Card, Aadhaar Card, PAN Card, Special Disability ID Card, Bank, Post Office Pass Book, Health Insurance Smart Card, Driving License, Passport, MPs, MLAs, MLCs Issued Special Identity Cards, Employment Guarantee Job Card

రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. మే 13న తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. అయితే ఈ సమయంలో ఓటు హక్కును వినియోగించుకోబోతున్న కొంతమందికి కొన్ని సందేహాలు వస్తున్నాయి. ఓటు వేయాలంటే ఓటరు కార్డు తప్పనిసరిగా ఉండాలా? అనేక రకాలు గుర్తింపు కార్డులు వంటి ఇతర కార్డులు ఉన్నా కూడా ఓటర్ ఐడీ చూపిస్తేనే ఓటేయగలమా అన్న అనుమానాలు వారికి కలుగుతున్నాయి.

అయితే ఓటరు కార్డు తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం చెబుతోంది. ఓటరు కార్డు లేకపోయినా కొన్ని గుర్తింపు కార్డులతో ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఓటు ప్రతి వ్యక్తికి ఒక వజ్రాయుధమని, ఆ ఓటును వినియోగించుకోవడానికి ఓటరు కార్డు తప్పకుండా ఉండాలని షరతు పెట్టమని అంటున్నారు. ఓటరు కార్డు లేని వారు కూడా ఓటు వేసేలా చేస్తామని..దీంతో పోలింగ్ శాతాన్ని పెంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. ఓటర్‌కు తమ పోలింగ్ బూత్ కచ్చితంగా తెలియడానికి ఓటర్ల స్లిప్ ను కలిగి ఉంటే సరిపోతుందని అంటున్నారు.

ఓటు వేయడానికి ఓటరుకు కావాల్సిన కార్డులు..ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు,పాన్ కార్డు, ప్రత్యేక వైకల్యం ఐడీ కార్డు, బ్యాంకు, పోస్టాఫీసు పాస్ బుక్, ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్, ఎన్‌పీఆర్ కింద ఆర్టీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు… ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఎన్నికలకు అధికారులు జారీ చేసిన ప్రత్యేక గుర్తింపు కార్డులు, ఉపాధి హామీ జాబ్ కార్డు..ఇలా వీటిలో ఏ ఒక్క కార్డు ఉన్నాసరే ఆ ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.మే 13న పోలింగ్ జరగనుండటంతో..ఆరోజు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల సంస్థలకు సెలవు దినంగా అధికారులు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలని..అందుకే ఆరోజు సెలవుదినంగా ప్రకటించినట్లు అధికారులు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 6 =