ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్

World Famous Motivational Speaker Nick Vujicic Meets CM YS Jagan Today at Tadepalli,Motivational Speaker Nick Vujicic,Nick Vujicic Meets CM YS Jagan,Nick Vujicic Story,Nick Vujicic Wife,Nick Vujicic Book,Mango News,Mango News Telugu,Nick Vujicic Children,Nick Vujicic Quotes,Nick Vujicic Biography,Nick Vujicic,Nick Vujicic Family,Nick Vujicic Net Worth,Nick Vujicic Pronunciation,Nick Vujicic Videos,Nick Vujicic Achievements,Nick Vujicic Swimming,Pastor Nick Vujicic,Video Nick Vujicic

తన ప్రేరణాత్మక ప్రసంగాలతో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్, నిక్ వుజిసిక్ పక్కన నుంచుని ఫోటోలు దిగారు. అనంతరం నిక్, సీఎం వైఎస్ జగన్‌ను కలవడం చాలా ఆనందాన్నిస్తోందని తెలిపారు. మంగళవారం గుంటూరులోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను సందర్శించిన నిక్.. విద్యార్థినుల ప్రతిభాపాటవాలను మెచ్చుకున్నారు. ‘ప్రపంచం అంతటికీ నేను ఇన్స్పిరేషన్ గా నిలిచి ఉండొచ్చు.. కానీ ఈ ప్రాంతం నాకు ఇన్స్పిరేషన్ గా నిలిచింది’ అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాగా ఆస్ట్రేలియాకు చెందిన నికోలస్ జేమ్స్ వుజిసిక్ ‘ఫొకొమీలియా’ అనే రుగ్మత కారణంగా కాళ్ళు, చేతులు లేకుండానే పుట్టారు. కానీ ఈ వైకల్యాన్ని అధిగమించి ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన ప్రసంగం వినడానికి విద్యార్థులతో పాటు పెద్ద పెద్ద కంపెనీలలో పనిచేసే ఉన్నతస్థాయి ఉద్యోగులు, సంస్థల అధిపతులు కూడా ఆసక్తి చూపుతారంటే అతిశయోక్తి కాదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here