మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సాక్షి అనుమానాస్పద మృతి

YS Vivekananda Reddy Assassination Case Witness Gangadhar Reddy Lost life under Suspicious Circumstances, Witness Gangadhar Reddy Lost life under Suspicious Circumstances, Witness in YS Vivekananda Reddy murder case dies, Witness Gangadhar Reddy Lost life, YS Vivekananda Reddy Assassination Case Witness Gangadhar Reddy Lost life, Gangadhar Reddy Lost life under Suspicious Circumstances, Suspicious Circumstances, YS Vivekananda Reddy, Yeduguri Sandinti Vivekananda Reddy, Vivekananda Reddy, Vivekananda Reddy Assassination Case, Vivekananda Reddy Assassination, Witness Gangadhar Reddy, YS Vivekananda Reddy Assassination Case News, YS Vivekananda Reddy Assassination Case Latest News, YS Vivekananda Reddy Assassination Case Latest Updates, YS Vivekananda Reddy Assassination Case Live Updates, Mango News, Mango News Telugu,

మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురి అనుమానితులను, సాక్షులను విచారించిన సీబీఐ అధికారులు దర్యాప్తును ముమ్మురం చేశారు. కాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్‌రెడ్డి బుధవారం రాత్రి అనుమానాస్పదరీతిలో మృతి చెందాడు. వివేకా కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్‌ రెడ్డికి అనుచరుడైన గంగాధర్‌ రెడ్డిని కూడా సీబీఐ ఇప్పటికే విచారణ చేసింది. అనంతపురం జిల్లా యాడికిలోని తన ఇంట్లోనే గంగాధర్‌రెడ్డి మృతి చెందాడు.

గంగాధర్‌రెడ్డి బుధవారం రాత్రి నిద్రలోనే మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్‌ టీమ్‌ కూడా రంగంలోకి దిగి ఇంటిని, ఘటనా స్థలాన్ని పరిశీలించింది. మరోవైపు గంగాధర్‌ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − three =