ఘనంగా 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం, విజేతలకు అవార్డులు అందించిన రాష్ట్రపతి

68th National Film Awards Ceremony at New Delhi President Droupadi Murmu Presents Awards to Winners, 68th National Film Awards, National Film Awards Ceremony, National Film Awards Ceremony at New Delhi, President Droupadi Murmu Presents Awards, President Droupadi Murmu, Mango News, Mango News Telugu, Soorarai Pottru Movie, Colour Photo Movie, Natyam Movie, Sandeep Raj Director, Director Sudha Kongara Prasad, National Film Awards

68వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం శుక్రవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌ లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని సినీ ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ సహాయ మంత్రి కెఎల్ మురుగన్, జ్యూరీ చైర్ పర్సన్స్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి ఆశా పరేఖ్‌ 2020 సంవత్సరానికి గానూ అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశా పరేఖ్‌ కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందజేశారు.

మరోవైపు 2020 సంవత్సరానికి సంబంధించి జాతీయ ఉత్తమ నటుడుగా సూర్య (సూరరై పోట్రు), అజయ్ దేవగణ్ (తానాజీ), ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళి (సూరరై పోట్రు) జాతీయ అవార్డులను గెలుచుకోగా, జాతీయ ఉత్తమ చిత్రంగా సూరరై పోట్రు ఎంపికైన విషయం తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఉత్తమ తెలుగు చిత్రంగా “కలర్ ఫోటో” చిత్రం (నిర్మాతలు సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పనేని మరియు దర్శకుడు సందీప్ రాజ్) ఎంపికయింది. అలాగే ప్రముఖ నృత్యకారిణి సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మించగా నృత్య నేపథ్యంలో తెరకెక్కిన ‘నాట్యం’ చిత్రం రెండు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ కొరియోగ్రపీ విభాగంలో సంధ్యారాజు (నాట్యం), ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ విభాగంలో టీవీ రాంబాబు (నాట్యం) అవార్డుకు ఎంపికయ్యారు. ఇక ఉత్తమ మ్యూజిక్ డైరెక్షన్ విభాగంలో ఎస్ తమన్ (అల వైకుంఠపురంలో – సాంగ్స్) జాతీయ అవార్డు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో వీరంతా శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ చలన చిత్ర అవార్డులను అందుకున్నారు.

2020 సంవత్సరానికి సంబంధించి జాతీయ చలన చిత్ర అవార్డు విజేతల జాబితా:

 • ఉత్తమ చిత్రం: సూరరై పోట్రు (తమిళ్)
 • ఉత్తమ చిత్రం(హిందీ): తులసీదాస్ జూనియర్
 • ఉత్తమ చిత్రం(తెలుగు): కలర్ ఫోటో
 • ఉత్తమ కొరియోగ్రపీ: సంధ్యారాజు (నాట్యం)
 • ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: టీవీ రాంబాబు (నాట్యం)
 • ఉత్తమ మ్యూజిక్ డైరెక్షన్: ఎస్ తమన్ (అల వైకుంఠపురంలో – సాంగ్స్), జి వి ప్రకాష్ కుమార్ (సూరరై పోట్రు- బ్యాక్ గ్రౌండ్ స్కోర్)
 • ఉత్తమ నటుడు: సూర్య (సూరరై పోట్రు), అజయ్ దేవగణ్ (తానాజీ)
 • ఉత్తమ నటి: అపర్ణ బాలమురళి (సూరరై పోట్రు)
 • ఉత్తమ సహాయ నటుడు: బిజూ మీనన్ (ఎకె అయ్యప్పనుమ్ కోషియుమ్)
 • ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ ప్రియా చంద్రమౌళి (శివరంజనియుమ్ ఇన్నుంసిల పెంగల్లుమ్)
 • ఉత్తమ దర్శకుడు: సచ్చిదానందన్ కేఆర్ (ఎకె అయ్యప్పనుమ్ కోషియుమ్)‌
 • ఉత్తమ ఎడిటర్‌: శ్రీకర్ ప్రసాద్ (శివరంజనియుమ్ ఇన్నుంసిల పెంగల్లుమ్)
 • ఉత్తమ వినోదాత్మక చిత్రం: తానాజీ (హిందీ)
 • ఉత్తమ సామాజిక చిత్రం: పునరల్ (మరాఠి)
 • ఉత్తమ పర్యావరణ పరిరక్షణ నేపధ్య చిత్రం : తాలెందండ (కన్నడ)
 • ఉత్తమ పరిచయ దర్శకుడు (ఇందిరా గాంధీ అవార్డు): మడోన్ అశ్విన్ (మండేలా)
 • ఉత్తమ సినిమాటోగ్రఫీ: అవిజాట్రిక్ (బెంగాలీ) – సుప్రతిమ్ భోల్
 • ఉత్తమ ఆడియోగ్రఫీ: డోళ్లు (కన్నడ), మి వసంతరావు (మరాఠీ), మాలిక్ (మలయాళం)
 • ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: నచికేత్ బార్వే అండ్ మహేష్ షెర్లా (తానాజీ)
 • ఉత్తమ స్క్రీన్‌ ప్లే: సూరరై పొట్రు (తమిళం) – షాలినీ ఉషా నాయర్ అండ్ సుధా కొంగర
 • ఉత్తమ స్క్రీన్ ప్లే (డైలాగులు): మండేలా (తమిళం) – మడోన్ అశ్విన్
 • ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ : ఎకె అయ్యప్పనుమ్ కోషియుమ్ (మలయాళం) – రాజశేఖర్, మాఫియా శశి, సుప్రీమ్ సుందర్
 • ఉత్తమ లిరిక్స్: మనోజ్ ముంతాషిర్ (సైనా -హిందీ)
 • ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్‌ : అనీస్ నాడోడి (కప్పెల – మలయాళం)
 • ఉత్తమ గాయకుడు: రాహుల్ దేశ్‌పాండే – మి వసంతరావు (మరాఠీ),
 • ఉత్తమ గాయని: నాంచమ్మ –ఎకె అయ్యప్పనుమ్ కోషియుమ్ (మలయాళం)
 • ఉత్తమ బాల నటులు: అనిష్ మంగేష్ గోసావి (తక్-తక్ – మరాఠీ), ఆకాంక్ష పింగిల్, దివ్యేష్ ఇందుల్కర్ (సుమీ-మరాఠీ)
 • ఉత్తమ చిత్రం(తమిళ్): శివరంజనియుమ్ ఇన్నుంసిల పెంగల్లుమ్
 • ఉత్తమ చిత్రం(మలయాళం): తింకలాశ్చ నిశ్చయమ్
 • ఉత్తమ చిత్రం(కన్నడ): డోళ్లు
 • ఉత్తమ చిత్రం(మరాఠీ): గోష్ట ఏక పైథానిచి
 • ఉత్తమ చిత్రం(బెంగాలీ): అవిజాట్రిక్
 • ఉత్తమ చిత్రం(అస్సామీఎస్): బ్రిడ్జ్
 • మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్: మధ్యప్రదేశ్
 • సినిమాపై ఉత్తమ పుస్తకానికి అవార్డు: ది లాంగెస్ట్ కిస్ (ఇంగ్లీష్).

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here