కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం జగన్

CM YS Jagan Launches The Website of Kalyanamastu and Shadi Tofa Schemes, Kalyanamastu Scheme, Shadi Tofa Scheme, Kalyanamastu and Shadi Tofa , Kalyanamastu and Shadi Tofa Scheme, CM YS Jagan Launched Kalyanamastu and Shadi Tofa Website, Mango News, Mango News Telugu, Kalyanamastu Website, Shadi Tofa Website, Kalyanamastu and Shadi Tofa Website, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan Latest News And Live Updates

ఆంధ్రప్రదేశ్ లోని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, వికలాంగులు, ముస్లిం మైనారిటీల కోసం వివాహ ఆర్థిక సహాయం పథకం ‘వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు’, ముస్లింల కోసం ‘వైఎస్‌ఆర్ షాదీ తోఫా’ను అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి శుక్రవారం కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు లేదా కొన్ని వర్గాల నుండి వచ్చిన అమ్మాయిల వివాహానికి లక్ష రూపాయల సంఖ్యలో ఆర్ధిక సహాయం అందించబడుతుంది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం కింద లక్ష నుంచి లక్షా యాభై వేల రూపాయల వరకు ప్రభుత్వం అందిస్తుంది. రేపటినుంచి పథకానికి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అయితే వధూవరులిద్దరిరూ తప్పనిసరిగా పదో తరగతి చదివి ఉండాలి.

జగన్ సర్కార్ అక్టోబర్ 1 నుంచి అమలు చేయనున్న ఈ పథకాల ద్వారా అందనున్న ఆర్ధిక సహాయం..

  • వైఎస్ఆర్ కళ్యాణమస్తు: ఎస్సీలకు – రూ. 1 లక్ష
  • వైఎస్ఆర్ కళ్యాణమస్తు: ఎస్సీల కులాంతర వివాహాలకు – రూ.1.2 లక్షలు
  • వైఎస్ఆర్ కళ్యాణమస్తు: ఎస్టీలకు – లక్ష రూపాయలు
  • వైఎస్ఆర్ కళ్యాణమస్తు: ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు
  • వైఎస్ఆర్ కళ్యాణమస్తు: బీసీలకు – రూ.50వేలు
  • వైఎస్ఆర్ కళ్యాణమస్తు: బీసీల కులాంతర వివాహాలకు – రూ.75వేలు
  • వైఎస్ఆర్ కళ్యాణమస్తు: దివ్యాంగులు వివాహాలకు – రూ. 1.5 లక్షలు
  • వైఎస్ఆర్ కళ్యాణమస్తు: భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు – రూ.40వేలు
  • షాదీ తోఫా: మైనారిటీలకు – రూ. 1 లక్ష

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + seventeen =