‘మహా భారత్‌’ భీముడు.. ప్రవీణ్ కుమార్‌ సోబ్తీ కన్నుమూత

Actor Praveen Kumar Sobti Known As Bheem of Mahabharat, Actor Praveen Kumar Sobti Passed Away, Actor Praveen Kumar Sobti Passed Away Due To Heart Attack, Mahabharat Actor Parveen Kumar Sobti aka Bheem Passes away, Mahabharats Bheem actor Praveen Kumar Sobti Death, Mahabharats Bheem actor Praveen Kumar Sobti Death news, Mahabharats Bheem actor Praveen Kumar Sobti dies, Mango News, Mango News Telugu, Passed Away Due To Heart Attack, Praveen Kumar Sobti, Praveen Kumar Sobti Known As Bheem of Mahabharat, Praveen Kumar Sobti Passed Away

1980-90లలో మన దేశంలో భాషతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకున్న ప్రముఖ హిందీ సీరియల్స్.. ‘రామాయణ్’ మరియు ‘మహాభారత్’. వీటిలో ‘మహాభారత్‌’ ధారావాహికలో భీముడి పాత్రతో దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న ప్రవీణ్ కుమార్‌ సోబ్తీ సోమవారం అర్ధరాత్రి తుది శ్వాసవిడిచారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో ప్రవీణ్ గుండెపోటుతో కన్నుమూశారు. ప్రవీణ్ కు దీర్ఘకాలిక ఛాతీ ఇన్ఫెక్షన్ సమస్య ఉందని తెలుస్తోంది. రాత్రి, ప్రవీణ్ కు అసౌకర్యంగా అనిపించినప్పుడు.. మేము ఇంటికి వైద్యుడిని పిలిపించాము. అయితే, గుండె ఆగిపోవడంతో రాత్రి 10 మరియు 10.30 గంటల మధ్య మరణించాడు అని ప్రవీణ్ బంధువు మీడియాకు తెలిపారు. ఆయనకు భార్య, కుమార్తె, ఇద్దరు తమ్ముళ్లు, ఒక సోదరి ఉన్నారు.ఈ రోజు పంజాబీ బాగ్‌లోని శ్మశానవాటికలో అతని అంత్యక్రియలు జరుగుతాయి.

డిస్కస్ త్రోయర్ మరియు హ్యామర్ త్రోయర్‌గా కెరీర్ ప్రారంభించాడు ప్రవీణ్. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు మరియు కామన్వెల్త్ గేమ్స్ వంటి వేదికలపై అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అతను 1966 మరియు 1970 ఆసియా క్రీడలలో డిస్కస్ త్రోలో బంగారు పతకాలు, అలాగే 1966 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నాడు. క్రీడల్లో అతను సాధించిన విజయాలకు, అతను అర్జున అవార్డును గెలుచుకున్నాడు. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్)లో డిప్యూటీ కమాండెంట్‌గా కూడా పనిచేశారు. అయితే, తన 30వ ఏట క్రీడల నుండి విరమించుకున్నాడు ప్రవీణ్. ఆ తర్వాత, అతను అనేక హిందీ సినిమాలలో విలన్ గా నటించాడు. కానీ, అతనికి పేరు వచ్చింది మాత్రం టీవీ తెరపైనే. అతని ఎత్తు మరియు శరీరాకృతి కారణంగా 1988లో BR చోప్రా యొక్క పౌరాణిక నాటకం మహాభారత్‌లో భీమ్‌గా నటించాడు. ఆ పాత్ర అతనికి దేశవ్యాప్తంగా పేరు తెచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ