గురుకులాల్లో చదివిన 190 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు, మంత్రి కేటీఆర్ ప్రశంసలు

190 Govt gurukul school students secure MBBS seats, 190 Social Welfare Residential Students Get MBBS Seats, 190 students of TSWREIS secure MBBS seats, 190 TSWREIS students secure MBBS seats, caste wise reservation in telangana, government residential schools in telangana, KTR Congratulates Students, Mango News, Minister KTR Congratulates Students, Residential Students Get MBBS Seats, Social Welfare Residential Students Get MBBS Seats, telangana gurukula residential schools, telangana gurukula residential schools list, telangana reservation percentage, Telangana Residential Students Get MBBS Seats

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్) లో చదివిన 190 మంది విద్యార్థులు ఇటీవల ముగిసిన మొదటి రౌండ్ మెడికల్ కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్ సీట్లను సాధించడం ద్వారా చరిత్ర సృష్టించారు. కార్పొరేట్‌ సంస్థలతో సమానంగా నీట్‌ కోచింగ్‌ నిర్వహించేందుకు నిధులు మంజూరు చేసి పేద విద్యార్థులు పేదరికం నుంచి బయటపడి వారి కలలను సాకారం చేసుకునేందుకు నిధులు మంజూరు చేసిన ఘనత మొత్తం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుకు, మంత్రి కొప్పుల ఈశ్వర్‌కి చెందుతుందని టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. గత ఆరేళ్లలో మొత్తం 513 మంది విద్యార్థులను ఎంబీబీఎస్ సీట్లు పొందారని తెలిపారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో చదివి ఎంబీబీఎస్ సీట్లు సాధించిన 190 మంది విద్యార్థులను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఇది అద్భుతమైన వార్త అని పేర్కొన్నారు. ఇది సాధ్యమేయ్యేలా కృషిచేసిన షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బృందానికి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 9 =