ఏపీలో ఆందోళన కొనసాగిస్తున్న ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘాలు

Another Movement In AP, AP PRC, AP PRC Issue, AP Teachers Unions, AP Teachers Unions PRC, AP Teachers Unions PRC Issue, AP Teachers Unions Will Be Resigning, AP Teachers’ Federation cries foul, AP Teachers’ Unions Will Be Resigning To PRC Steering Committee, Implications For CM Jagan Again, Mango News, Mango News Telugu, Teacher unions disagree with the PRC steering committee, Teacher unions resent PRC panel’s climbdown, Teacher unions resent PRC panel’s climbdown on prime demands, Teachers Unions Will Be Resigning To PRC Steering Committee

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీపై కొనసాగుతున్న ఆందోళనలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతమైన తర్వాత.. సమ్మెలోకి వెళ్తామని ప్రకటించిన పీఆర్సీ సాధన సమితి నేతలు, మంత్రుల బృందంతో చర్చల అనంతరం సమ్మె విరమించుకుంటున్నట్లు చేసిన ప్రకటన మంటలు రేపుతోంది. ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని నేతలు ఒకవైపు చెప్తున్నా.. ఉద్యోగులు మాత్రం ఆ మాటలను నమ్మడం లేదు. ఈ నేపథ్యంలో.. పీఆర్సీ అంశంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగించాలని ఉద్యోగులు భావిస్తున్నారు.

ఈక్రమంలోనే.. మొదటగా నేడు పీఆర్సీ సాధనసమితి స్టీరింగ్ కమిటీకి ఉపాధ్యాయ సంఘాలు రాజీనామా చేయనున్నారు. ఆ తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణను ఉపాధ్యాయులు ప్రకటించనున్నారు. ఉపాధ్యాయుల బాటలోనే మేము కూడా నడుస్తామని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ముందుకొస్తున్నారు. మెరుగైన పీఆర్సీ కోసం మరో ఉమ్మడి వేదిక ఏర్పాటు చేసి ప్రభుత్వంపై పోరాడుతామని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. ఈరోజు మీడియా సమావేశంలో ఉపాధ్యాయులు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఈసారి చేయబోయే ఉద్యమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర ముఖ్యమైన నేతలతో మాట్లాడి సలహాలు, సూచనలను తీసుకుంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =