ఆసియాలో అత్యంత సంపన్నుడిగా స్థానం

Adani Surpasses Ambani Ranked as the Richest in Asia, Adani Surpasses Ambani, Adani Ranked as the Richest in Asia, Richest in Asia Adani, Asias Richest Person, Adani, Ambani, Ranked as the Richest in Asia, Adani Group Chairman Gautam Adani, Latest Adani Surpasses News, Latest Adani Richest in Asia News, India, Asia, Economy, Mango News, Mango News Telugu
Asia's richest person, Adani, Ambani, Ranked as the richest in Asia,Adani Group Chairman Gautam Adani

కొత్త ఏడాదిలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ.. ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ధనవంతుల జాబితా విడుదలవగా..దానిలో అదానీ 12వ స్థానంలో నిలిచారు. ఆయన ఆదాయ నికర విలువ 97.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఆసియాలో అత్యంత సంపన్నుడిగా అదానీ మొదటి స్థానంలో నిలిచారు.

మరోవైపు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ధనవంతుల జాబితాలో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 97 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలో రెండో స్థానానికి పరిమితమయ్యారు. ప్రపంచంలో 13వ స్థానానికి దిగజారిపోయారు. అయితే గౌతమ్ అదానీ కంటే ముందు ముఖేష్ అంబానీనే ఆసియాలో అత్యంత సంపన్నుడుగా ఉన్న విషయం తెలిసిందే.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ రిలీజ్ చేసిన డేటా ప్రకారం.. ప్రపంచంలోని టాప్ -20 బిలియనీర్లలో కొత్త ఏడాదిలో  ముగ్గురి నికర విలువ మాత్రమే పెరిగినట్లు తేలింది. వీటిలో అదానీ, అంబానీలతో పాటు అమెరికాకు చెందిన వారెన్ బఫెట్ కూడా ఉన్నారు. అయితే ఈ ముగ్గురిలో కూడా గౌతమ్ అదానీ నికర విలువలో మాత్రం విపరీతమైన పెరుగుదల కనిపించింది. అదానీ సంపద 24 గంటల్లో 7.6 బిలియన్ డాలర్లు పెరిగిందని బ్లూమ్ బెర్గ్ ప్రకటించింది.

దీనికి కారణం..అదానీ గ్రూప్‌‌నకు చెందిన పది లిస్టెడ్ కంపెనీలు తమ మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు దాదాపు రూ. 65,500 కోట్లు జోడించాయి. గతంలో  హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపణలపై విచారించిన సుప్రీం కోర్టు.. గౌతమ్ అదానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో..  ఆ కంపెనీల షేర్లలో ఒక్కసారిగా పెరుగుదల కనిపించింది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక రోజులోనే  రూ.14.47 లక్షల కోట్ల నుంచి  రూ.15.11 లక్షల కోట్లకు పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు ముఖేష్ అంబానీని అధిగమించి.. ఆసియాలోనే అత్యంత సంపన్నుల జాబితాలో తొలి స్థానాన్ని గౌతమ్ అదానీ దక్కించుకున్నట్లు అయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY