కాంగ్రెస్‌లోకి షర్మిల.. భగ్గుమన్న కొడాలి నాని

Sharmila Bhaggumanna Kodali Nani to Congress, Sharmila Bhaggumanna, Kodali Nani to Congress, Bhaggumanna Kodali Nani, YS Sharmila, Congress, Kodali Nani, CM Jagan, YCP, AP Politics, Latest Bhaggumanna Kodali Nani News, Kodali Nani News, Latest Kodali Nani News, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
YS Sharmila, Congress, Kodali Nani, CM Jagan, YCP, AP Politics

వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. గురువారం తన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆ పార్టీలో చేరిపోయారు. అయితే షర్మిల వైసీపీలో చేరడంపై ఒక్కొక్కరుగా వైసీపీ నేతలు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరితో వైసీపీకి ఎటువంటి నష్టం లేదని.. వైవి సుబ్బారెడ్డి అన్నారు. తెలంగాణలో పరిస్థితులు బాగోలేక షర్మిల కాంగ్రెస్‌లో చేరిందన్న సుబ్బారెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌కి గానీ, ఇక్కడి రాజకీయాలకు గానీ ఎటువంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. అయితే షర్మిల కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో కొడాలి నాని స్పందించారు. కానీ షర్మిలను ఒక్క మాట అనకుండా.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించిందని.. ఏపీ హక్కుల్ని గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కాంగ్రెస్‌కు ఒక్క శాతం ఓట్లు కూడా లేవని విమర్శించారు. ఏపీలో పార్టీని బతికించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డినే కాంగ్రెస్ దోషిగా చిత్రీకరించిందని ఆరోపించారు. ఆయన మరణం తర్వాత ముద్దాయిగా చూపించిన కాంగ్రెస్‌పై మండిపడ్డారు. వైఎస్ కుమారుడు జగన్మోహన్ రెడ్డిని జైలుపాలు చేసిందని మండిపడ్డారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కనుమరుగైపోయిందన్నారు. ముఖ్యంగా ఈ రెండు కారణాలే ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడానికి కారణమని వ్యాఖ్యానించారు.

ఏపీలో కాంగ్రెస్ తిరిగి తన ఉనికిని కాపాడుకోవాలంటే.. రాజశేఖర్ రెడ్డికి బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రాజశేఖర్ రెడ్డిని దోషిని చేశామని.. జగన్‌ను జైలులో పెట్టామని కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకొని తీరాలన్నారు. ఇలా చేస్తేనే కాంగ్రెస్ తిరిగి ఉనికిని చాటుకుంటుందని.. ఓట్లు పడుతాయని కొడాలి నాని చెప్పుకొచ్చారు. అలాగే ఆళ్ల రామకృష్ణా రెడ్డి.. మల్లాది విష్ణు చేరబోతున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కూడా స్పందించిన నాని.. కాంగ్రెస్‌లో ఎంతమంది చేరినా కాంగ్రెస్‌కు ఎటువంటి ప్రయోజనం ఉండదని విమర్శించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + one =