పాకిస్థాన్ ఆర్మీ కొత్త చీఫ్‌ గా లెఫ్టినెంట్ జనరల్‌ అసిమ్‌ మునిర్‌ నియామకం

Lieutenant General Asim Munir Appointed as New Pakistan Army Chief,Lt. Gen Asim Munir, New Chief Of Pakistan Army,Lieutenant-General Asim Munir,Mango News,Mango News Telugu,Pakistan Army Chief,Pakistan Army Chief New,New Pakistan Army Chief,New Pakistan Army Chief Asim Munir,Asim Munir Latest News And Updates,Pakistan Army Chief News And Live Updates,Pakistan Army Chief New Asim Munir,Pakistan Latest News,Pakistan,India

పాకిస్థాన్ ఆర్మీ కొత్త చీఫ్‌ గా లెఫ్టినెంట్ జనరల్‌, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఏజెన్సీ మాజీ చీఫ్ అసిమ్‌ మునిర్‌ నియమితులయ్యారు. ప్రస్తుత పాకిస్థాన్ సైన్యాధిపతి జనరల్ కమర్ బజ్వా నవంబర్ 29న పదవీ విరమణ చేయబోతున్న నేపథ్యంలో, ఆ స్థానంలో అసిమ్ మునీర్‌ను నియమిస్తూ పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం నిర్ణయం తీసుకున్నారు. అలాగే లెఫ్టినెంట్‌ జనరల్‌ సాహిర్ షంషాద్ మీర్జాను జాయింట్ చీఫ్స్‌ ఆఫ్ స్టాఫ్‌ కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. పాకిస్తాన్ యొక్క 17వ ఆర్మీ చీఫ్ గా నవంబర్ 29న అసిమ్‌ మునిర్‌ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి మర్రియం ఔరంగజేబ్ ట్విట్టర్‌లో ప్రకటన చేస్తూ “జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా లెఫ్టినెంట్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాను మరియు రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించి లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్‌ను ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా నియమించాలని పాకిస్తాన్ ప్రధాని మహమ్మద్ షెహబాజ్ షరీఫ్ నిర్ణయించారు. ఈ నియామకానికి సంబంధించిన అధికారిక ప్రతిపాదన యొక్క సారాంశాన్ని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి పంపారు” అని ఆమె పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here