ఆదిత్య ఎల్-1 ప్రయోగంపై ఆసక్తిగా గమనిస్తున్న ప్రపంచ దేశాలు

Indias Maiden Solar Mission Aditya L1 Set to Launch Today to Explore Solar Activity,Indias Maiden Solar Mission,Solar Mission Aditya L1,Aditya L1 Set to Launch Today,Explore Solar Activity,Mango News,Mango News Telugu,Countries, world , watching, launch of Aditya L-1, Aditya L-1, Aditya L-1 launched on September 2, ISRO,Indias Maiden Solar Mission Latest News,Indias Maiden Solar Mission Latest Updates,Aditya L1 Launch News Today,Mission Aditya L1 Latest News,Mission Aditya L1 Latest Updates

ఇప్పటివరకూ చంద్రుడిపై రహస్యాల్ని తెలుసుకునేందుకు ప్రయోగించిన చంద్రయాన్-3 విజయం గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. కానీ ఓవైపు చంద్రయాన్-3ని నిర్వహిస్తూనే మరోవైపు సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు ఇస్రో ఆదిత్య ఎల్-1 మిషన్ ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో ఈ రోజు ఉదయం 11.50 నిమిషాలకు ఆదిత్య ఎల్-1ను ప్రయోగిస్తోంది. ఇది విజయవంతమైతే భారత్ సూపర్ పవర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

సూర్యుడిపై దాగి ఉన్న ఎన్నో రహస్యాలను ఛేదించేందుకు గత కొన్ని దశాబ్దాలుగా పలు దేశాలు సోలార్ మిషన్‌లను ప్రయోగిస్తునే ఉన్నాయి. వాటిలో కొన్ని విజయవంతం కాగా.. మరికొన్ని విఫలమయ్యాయి కూడా. ఇప్పుడు చంద్రుడిపై కాలు మోపిన ఊపులో ఉన్న ఇస్రో.. ఈసారి అదే ఊపులో సూర్యుడిపైనా అడుగుపెట్టి ప్రపంచానికి తానేంటో చూపించాలని పట్టుదలగా ఉంది. దీంతో ఇస్రో చేపట్టబోయే ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.

సెప్టెంబర్‌ 2న ఇస్రో ప్రయోగించే ఆదిత్య ఎల్-1 విజయవంతమైతే భారత్ ఎన్నో మైలురాళ్లను అధిగమించబోతోంది. ముఖ్యంగా సూర్యుని గురించి అధ్యయనం చేస్తున్న అతి కొద్ది దేశాల సరసన భారత్ నిలవబోతోంది. సౌర మంటలు కరోనల్ మాస్ ఎజెక్షన్‌లను పరిశోధించడానికి గత సంవత్సరం ప్రారంభించిన అడ్వాన్స్‌డ్ స్పేస్-బేస్డ్ సోలార్ అబ్జర్వేటరీతో సహా చైనాకు చెందిన రెండు అంతరిక్ష నౌకలు ప్రస్తుతం భూమి కక్ష్యలో కలిగి ఉన్నాయి.

జపాన్, యూకే, యూఎస్, యూరప్‌ అంతరిక్ష ఏజెన్సీల మద్దతుతో హినోడ్ అనే నౌక భూమిని పరిభ్రమిస్తోంది. అలాగే సూర్యుని అయస్కాంత క్షేత్రాలను కొలుస్తుంది. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన సోలార్ అండ్ హీలియోస్పిరిక్ అబ్జర్వేటరీ మిషన్ (SOHO)… ఆదిత్య ఎల్-1 కోసం ఇస్రో లక్ష్యంగా పెట్టుకున్న లాగ్రాంజ్ పాయింట్‌కు సమీపంలోనే ఉంది. మరొక సంయుక్త-యూరోపియన్ మిషన్ సోలార్ ఆర్బిటర్, సూర్యుని నుంచి దాదాపు 42 మిలియన్ కి.మీ. దూరంలో ఉంది.

అమెరికాలో పార్కర్ సోలార్ ప్రోబ్‌తో సహా ఇతర సౌర మిషన్లు ఉన్నాయి. ఇది 2021లో సూర్యుని కరోనా లేదా ఎగువ వాతావరణం గుండా ప్రయాణించిన మొదటి అంతరిక్ష నౌకగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఇస్రో ప్రయోగించే ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయవంతమైతే భారత్ కూడా ఈ దేశాల సరసన చేరబోతోంది. అలాగే వారి కన్నా మెరుగ్గా తక్కువ సమయంలో ఈ ప్రయోగం చేసి కొత్త రికార్డులు నెలకొల్పడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. దీంతో భారత్ దూకుడును ప్రపంచ దేశాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + fourteen =