రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్ సింగ్‌ ఎన్నిక

Harivansh Narayan Singh, Harivansh Narayan Singh As Rajya Sabha Deputy Chairman, Harivansh Narayan Singh Elected As Rajya Sabha Deputy Chairman, Harivansh Narayan Singh Rajya Sabha Deputy Chairman, rajya sabha, Rajya Sabha Deputy Chairman, Rajya Sabha Latest News, Rajya Sabha Live Updates, Rajya Sabha New Deputy Chairman, Rajya Sabha News

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్డీఏ అభ్యర్థి, జేడియూ పార్టీకి చెందిన హరివంశ్‌ నారాయణ్ సింగ్‌ ఎన్నికయ్యారు. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు వాయిస్‌ఓట్‌ ద్వారా‌ ఎన్నిక నిర్వహించగా, యూపీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆర్జేడీ నేత మనోజ్‌ ఝాపై హరివంశ్‌ విజయం సాధించారు. అనంతరం హరివంశ్‌ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైనట్టు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రకటించారు. డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్ ఎన్నికవడం ఇది రెండోసారి. 2018 లో మొదటిసారి ఎన్నికవగా, పదవీకాలం పూర్తవడంతో మరోసారి బరిలో నిలిచి విజయం సాధించారు. రాజ్యసభలో ఎన్డీఏకు 113 మంది సభ్యుల బలం ఉండగా, విజయం కోసం ఎన్డీఏ కూటమి విపక్షాల మద్దతు కూడగట్టింది. ఈ ఎన్నికలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వైసీపీ పార్టీ ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు ఇవ్వగా, టిఆర్ఎస్ పార్టీ ఓటింగ్‌కు దూరంగా ఉంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here