యూఎన్ మిష‌న్‌లో చేరిన భార‌త అతిపెద్ద మహిళా పీస్‌ కీప‌ర్స్ ప్లాటూన్, సుడాన్‌ దేశంలో ప్రత్యేక విధులు

Indian Army Deploys Largest Platoon of Women Peacekeepers in Sudan's Abyei Region For UN Mission, Sudan's Abyei Region For UN Mission,Indian Army Deploys Largest Platoon of Women Peacekeepers, Largest Platoon of Women Peacekeepers,Sudan's Abyei Region,UN Mission,United Nations Interim Security Force, largest contingent of women peacekeepers for UN, UN Mission News, UN Mission Latest News, UN Mission Live Updates, Mango News, Mango News Telugu

భార‌త్‌కు చెందిన అతిపెద్ద‌ మ‌హిళా బెటాలియ‌న్ ఐక్యరాజ్యసమితి (యూఎన్) మిష‌న్‌లో చేరింది. ఈమేరకు శుక్రవారం సూడాన్‌ దేశంలోని అబేయ్ ప్రాంతంలో వీరు విధులు నిర్వర్తించనున్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. దీంతో 2007లో లైబీరియాలో మొట్ట మొదటిసారిగా మహిళా బృందాన్ని మోహరించినప్పటి నుండి ఇప్పటివరకూ ఇదే అతిపెద్ద మహిళా శాంతి పరిరక్షకుల ప్లాటూన్‌ కావడం విశేషం. అలాగే ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్‌లో మొత్తం మహిళా బృందాన్ని మోహరించిన మొదటి దేశంగా కూడా భారత్ అవతరించింది. ఇక ఈ ప్లాటూన్‌లో ఇద్దరు అధికారులు మరియు 25 మంది ఇతర ర్యాంక్‌లతో కూడిన మహిళా పీస్‌ కీప‌ర్స్ ఉంటారు. వీరు విస్తృతమైన భద్రతా సంబంధిత విధులను కూడా నిర్వహిస్తారు. కాగా ప్రస్తుతం అబేయ్‌లో పరిస్థితులు కొంచెం ప్రమాదకరంగా ఉన్నాయి. మహిళలు మరియు పిల్లలపై పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత బెటాలియ‌న్ తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహించాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE