ఏపీలో పాఠశాలలు, విద్యాసంస్ధలకు సంక్రాంతి సెలవుల్లో మార్పులు.. ఎప్పటినుంచి అంటే?

AP Govt Announces Pongal Holidays For All The Schools and Colleges From Jan 12th to 17th, AP Govt Declares Sankranti Holidays, AP Govt Declares Sankranti Holidays For Colleges January 13-15, AP Govt Declares Sankranti Holidays For Schools From January 13-17, AP Govt Declares Sankranti Holidays For Schools From January 13-17 For Colleges January 13-15, AP Latest News And Updates, AP News, AP Sankranti, AP Sankranti Holidays, Mango News, Mango News Telugu, Pongal Holidays For All The Schools and Colleges From Jan 12th to 17th, Sankranti 2023, Sankranti Holidays, Sankranti Holidays For Schools And Colleges, Schools And Colleges

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, విద్యాసంస్ధలకు సంక్రాంతి సెలవుల్లో స్వల్ప మార్పులు చేసింది. ఈ నెల 12నుంచి 18వ తేదీ వరకు సెలవులుగా ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం మొదట ప్రకటించిన షెడ్యూల్ లో మార్పు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. జనవరి 11 నుంచి 16 వరకు సెలవులు ఉండగా.. 17వ తేదీన ‘ముక్కనుమ’ పండుగ ఉన్నందున ఆరోజున సెలవు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి విజ్ఞప్తి రావడంతో విద్యాశాఖ అధికారులు పునరాలోచించారు. దీంతో ఈ నెల 12నుంచి 18వ తేదీ వరకు సెలవులుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిప్రకారం, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ పాఠశాలలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. అలాగే సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి 19వ తేదీన పునఃప్రారంభమవుతాయని వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =