విజయ డెయిరీ నూతన ఔట్ లెట్స్ పెద్దఎత్తున ఏర్పాటు, ప్రజలకు మరింత అందుబాటులోకి : మంత్రి తలసాని

Minister Talasani Srinivas Yadav Inaugurates Vijaya Dairy Stall at Exhibition Grounds Nampally, Vijaya Dairy Stall at Exhibition Grounds Nampally, Nampally Exhibition Grounds, Vijaya Dairy Stall, Minister Talasani Srinivas Yadav, Telangana State Animal Husbandry Minister Talasani Srinivas Yadav, Vijaya Dairy, Vijaya Dairy News, Vijaya Dairy Latest News, Vijaya Dairy Live Updates, Mango News, Mango News Telugu

విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పెద్దఎత్తున నూతన ఔట్ లెట్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన విజయ డెయిరీ ఉత్పత్తుల స్టాల్ ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డెయిరీ చైర్మన్ సోమా భరత్ కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హాలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వివిధ ప్రాంతాల నుండి ఎగ్జిబిషన్ కు వచ్చే ప్రజలకు విజయ ఉత్పత్తులు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో స్టాల్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎంతో నాణ్యమైన విజయ డెయిరీ ఉత్పత్తులకు మొదటి నుండి ప్రజాదరణ ఉందని, గత ప్రభుత్వాలు ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడం వలన విజయ డెయిరీ అభివృద్దికి నోచుకోలేదని, నష్టాలతో మూసివేసే దశకు చేరుకుందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో విజయ డెయిరీ ఎంతో అభివృద్ధి సాధించిందని, నూతన ఉత్పత్తులు కూడా అనేకం వచ్చాయని తెలిపారు. పెద్ద ఎత్తున నూతన ఔట్ లెట్ లను ఏర్పాటు చేయడం వలన విజయ ఉత్పత్తుల విక్రయాలు గణనీయంగా పెరిగాయని, ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలతో నేడు విజయ డెయిరీ 700 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ కు చేరుకుందని వివరించారు. నూతనంగా మెగా డెయిరీ ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే ట్యాంక్ బండ్ పై కూడా విజయ డెయిరీ ఔట్ లెట్ ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం బూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి, ఎగ్జిబిషన్ అసోసియేషన్ వైస్ చైర్మన్ అశ్విన్, విజయా డెయిరీ అధికారులు అరుణ్, మల్లిఖార్జున్, ప్రభాకర్, కామేష్, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 10 =