గోధుమల ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రప్రభుత్వం.. దేశంలో తీవ్ర కొరతే కారణం?

India Central Govt Bans Wheat Exports with Immediate Effect To Control Rising Domestic Prices, Central Govt Bans Wheat Exports with Immediate Effect To Control Rising Domestic Prices, To control domestic prices, India bans wheat exports with immediate effect, Govt Bans Wheat Exports with Immediate Effect To Control Rising Domestic Prices, Rising Domestic Prices, India Central Govt Bans Wheat Exports with Immediate Effect, Central Govt Bans Wheat Exports with Immediate Effect, India Central Govt Bans Wheat Exports, Wheat Exports Bans, Wheat Exports, India has banned wheat exports with immediate effect as part of measures to control rising domestic prices, Central Govt has banned wheat exports with immediate effect, Wheat Exports Bans News, Wheat Exports Bans Latest News, Wheat Exports Bans Latest Updates, Wheat Exports Bans Live Updates, Mango News, Mango News Telugu,

భారతప్రభుత్వం దేశీయంగా పెరుగుతున్న ధరలను నియంత్రించడానికి గోధుమ ఎగుమతులపై తక్షణ నిషేధం విధించింది. నిన్నటి నోటిఫికేషన్‌లో లేదా అంతకు ముందు క్రెడిట్ లెటర్స్ జారీ చేయబడిన ఎగుమతి షిప్‌మెంట్‌లు మాత్రమే అనుమతించబడతాయని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా ఇతర దేశాల నుంచి వచ్చే అభ్యర్థనలపై ఎగుమతులకు ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతినిస్తుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్‌లో పేర్కొంది. దేశం యొక్క మొత్తం ఆహార భద్రతను నిర్వహించడానికి మరియు ఇతర బలహీన దేశాల అవసరాలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నోటిఫికేషన్ పేర్కొంది. గోధుమ ఎగుమతులను అరికట్టడానికి భారతదేశం చర్యలు తీసుకోవడం ప్రారంభించిందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు.

ఫిబ్రవరి చివరలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినప్పటి నుండి నల్ల సముద్రం ప్రాంతం నుండి ఎగుమతులకు ఆటంకం ఏర్పడిన నేపథ్యంలో.. వినియోగం కోసం ప్రపంచ దేశాలు భారతదేశానికి అధిక డిమాండ్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలో గోధుమల కొరత ఏర్పడొచ్చని ఆహార నిపుణులు సూచించారు. దీంతో స్వదేశంలో ధరల పెరుగుదలను నియంత్రించే చర్యల్లో భాగంగా భారత్ గోధుమల ఎగుమతులపై తక్షణమే నిషేధం విధించింది. చైనా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారు ఇండియానే కావడం గమనార్హం. భారత్ నుండి గోధుమల ఎగుమతులను పెంచే అవకాశాలను అన్వేషించడానికి కేంద్రం మొరాకో, ట్యునీషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం, టర్కీ, అల్జీరియా మరియు లెబనాన్‌లకు వాణిజ్య ప్రతినిధులను పంపుతుంది. భారతదేశం యేడాదికి రికార్డు స్థాయిలో 10 మిలియన్ టన్నుల గోధుమలను లక్ష్యంగా పెట్టుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here