కర్ణాటక ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం.. కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యపై మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు పోటీ?

Karnataka Assembly Elections Former CM Yediyurappa's Son Likely To Contest Against Ex CM Siddaramaiah,Karnataka Assembly Elections,Former CM Yediyurappa's Son Likely To Contest,CM Yediyurappa's Son Contest Against Ex CM Siddaramaiah,Mango News,Mango News Telugu,Karnataka Assembly Elections 2023,Former CM Yediyurappa's Son Latest News,Ex CM Siddaramaiah,karnataka Election 2023 Prediction,Karnataka Elections 2023,Press Conference by ECI,Karnataka Elections Voting on May 10,Dates For Karnataka Election 2023

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర పోటీ చేయనున్నారు. ఈ మేరకు బీజేపీ ఎన్నికల ప్రచారానికి నేతృత్వం వహిస్తున్న యడియూరప్ప దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. తన కుమారుడు సిద్ధరామయ్యపై పోటీ చేసే అవకాశం ఉందని సూచించిన ఆయన కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లకు మించి రావని యడియూరప్ప జోస్యం చెప్పారు. విజయేంద్రను వరుణ నుండి పోటీకి దింపాలా వద్దా అనే దానిపై ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అధిష్టానం నుంచి సానుకూల సందేశం రావొచ్చని భావిస్తున్నామని యడియూరప్ప తెలిపారు.

ఎన్నికల కమిషన్ కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన అనంతరం బెంగళూరులో నిర్వహించిన ఎమర్జెన్సీ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో యడియూరప్ప ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా సిద్ధరామయ్య, ప్రస్తుతం ఆయన కుమారుడు యతీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న మైసూరులోని వరుణ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇదిలా ఉండగా మరోవైపు కర్ణాటకలో ప్రస్తుతం రిజర్వేషన్లపై ఆందోళనలు జరుగుతున్న తరుణంలో యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. లింగాయత్‌లు మరియు ఇతర వర్గాలకు రిజర్వేషన్ కోటా న్యాయబద్ధమైనదేనని, దీనివలన ముస్లింలకు ఎలాంటి అన్యాయం జరగలేదని స్పష్టం చేశారు. ఇప్పుడు వారికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలలో రిజర్వేషన్లు లభిస్తాయని యడియూరప్ప అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here