శ్రీరామ నవమి సందర్భంగా.. హైదరాబాద్‌లో కొనసాగుతున్న శోభాయాత్ర, 2వేల మంది పోలీసులతో బందోబస్తు

Sri Rama Navami Shobha Yatra is on Going in Hyderabad with Tight Security of Two Thousand Police Personnel,Sri Rama Navami Shobha Yatra in Hyderabad,Sri Rama Navami Shobha Yatra is on Going,Sri Rama Navami in Hyderabad with Tight Security,Shobha Yatra in Hyderabad with Two Thousand Police Personnel,Mango News,Mango News Telugu,Tight security for Rama Navami Shobha Yatra,Sri Rama Navami Shobha Yatra begins,Ram Navami 2023,Rama Navami Shobha Yatra 2023, Rama Navami Shobha Yatra Latest News,Hyderabad Rama Navami Shobha Yatra Live,Sri Rama Navami Shobha Yatra Highlights

శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్‌లో శ్రీరామ్ శోభాయాత్ర కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం వేలాదిగా తరలి వచ్చిన రామ భక్తుల జై శ్రీ రామ్ నినాదాలతో పాతబస్తీ లోని సీతారాంబాగ్ రామ మందిరం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర హనుమాన్ వ్యాయమశాల వరకు దాదాపు 7 కిలో మీటర్ల మేర జరుగనుంది. ఈ క్రమంలో సీతారాంబాగ్‌ ఆలయం – బోయగూడ కమాన్‌ నుంచి మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ రోడ్డు, జాలి హనుమాన్‌, దూల్‌పేట, పురానాపూల్‌, జుమేరాత్‌ బజార్‌, చుడిబజార్‌, బేగంబజార్‌ చత్రి, బర్తన్‌ బజార్‌, సిద్దంబర్‌ బజార్‌ మసీదు, శంకర్‌ షేర్‌ హోటల్‌, గౌలిగూడ కమాన్‌, గురుద్వారా, పుత్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్‌ మీదుగా సుమారు రాత్రి 7-8 గంటల మధ్య సుల్తాన్‌ బజార్‌లోని హనుమాన్‌ వ్యాయామశాలకు యాత్ర చేరుకోనుంది. కాగా శ్రీరామ్ శోభాయాత్ర సందర్భంగా భక్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఇక శోభాయాత్ర సందర్భంగా యాత్ర మార్గాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు రెండు వేల మంది సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. టాస్క్ ఫోర్స్, ఆక్టోఫస్ బలగాలతో శోభాయాత్రపై నిఘా పెట్టిన పోలీసులు.. డ్రోన్ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి యాత్రను పర్యవేక్షిస్తున్నారు. అలాగే మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. భక్తులు కూడా సహకరించాలని, అనవసర వ్యాఖ్యలు, నినాదాలు చేయకుండా చూడాలని యాత్ర నిర్వాహకులకు ఇప్పటికే పోలీసులు సూచించారు. కాగా సాయంత్రం హనుమాన్‌ వ్యాయామశాల పాఠశాలలో జరిగే బహిరంగ సభకు శ్రీ కాశీ సుమేరు పీఠాధీశ స్వామి నరేంద్రానంద సరస్వతి ముఖ్య అతిథిగా, సంతభోమ రామ్‌జీ మహరాజ్‌ అతిథిగా హాజరవనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here