నవంబర్ లో రూ.1,45,867 కోట్ల జీఎస్టీ వసూళ్లు, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 11 శాతం ఎక్కువ

November 2022 GST Revenue: Rs 1,45, 867 Cr Collected, 11 Percent Higher than GST Revenues of NOV 2021

దేశంలో నవంబర్ నెలలో రూ.1,45,867 కోట్ల గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. 2022 మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇలా వరుసగా తొమ్మిది నెలల్లో రూ.1.40 లక్షల కోట్లకు పైగానే జీఎస్టీ వసూళ్ల సేకరణ జరిగిందని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు నవంబర్ 2022లో నమోదైన జీఎస్టీ వసూళ్లు నవంబర్ 2021 కంటే 11% ఎక్కువని పేర్కొన్నారు. నవంబర్ లో వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయాలు 20% ఎక్కువగా ఉన్నాయని మరియు దేశీయ లావాదేవీల (సేవల దిగుమతితో సహా) ద్వారా వచ్చే ఆదాయాలు గత ఏడాది ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయాల కంటే 8% ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

నవంబర్ లో సీజీఎస్టీ వసూళ్లు రూ.25,681 కోట్లు కాగా, ఎస్‌జీఎస్టీ వసూళ్లు రూ.32,651 కోట్లు, ఐజీఎస్టీ రూ.77,103 కోట్లు (దిగుమతులపై వసూళ్లు రూ.38,635 కోట్లతో సహా) మరియు సెస్సుల నుంచి రూ.10,433 కోట్లు (దిగుమతులపై వసూలు చేసిన రూ.817 కోట్లతో కలిపి) గా నమోదయ్యాయి. ప్రభుత్వం ఐజీఎస్టీ నుండి సీజీఎస్టీకి రూ.33,997 కోట్లు మరియు ఎస్‌జీఎస్టీకి రూ.28,538 కోట్లు చెల్లించింది. రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత నవంబర్ 2022 నెలలో కేంద్రం మరియు రాష్ట్రాల మొత్తం ఆదాయం సీజీఎస్టీకి రూ.59678 కోట్లు మరియు ఎస్‌జీఎస్టీకి రూ.61189 కోట్లుగా ఉంది.

అత్యధికంగా మహారాష్ట్రలో రూ.21,611 కోట్లు, కర్ణాటకలో రూ.10,238 కోట్లు, గుజరాత్ లో రూ.9,333 కోట్లు నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది నవంబర్ జీఎస్టీ వసూళ్లు (రూ.2,750 కోట్లు) పోలిస్తే ఈ ఏడాది నవంబర్ లో (రూ.3,134 కోట్లు) 14 శాతం పెరిగాయి. అలాగే తెలంగాణలో 2021 నవంబర్ లో రూ.3,931 కోట్లు వసూలు కాగా, 2022 నవంబర్ లో 8 శాతం పెరుగుదలతో రూ.4,228 కోట్లు వసూలు అయ్యాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =