ఢిల్లీ లిక్కర్ స్కాం: ఈడీ రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

Telangana BJP MLA Etela Rajender Responds Over ED Mentioned MLC Kavitha Name in Remand Report,Telangana BJP MLA Etela Rajender,ED Mentioned MLC Kavitha,Director For Investigation,Mango News,Mango News Telugu,Delhi Excise Policy Scam Latest News And Updates,Delhi Excise Policy Scam News And Live Updates,Delhi Liquor Policy Scam,Delhi Liquor Scam Accused List,Delhi Excise Policy,Delhi Excise Policy Case,Delhi Excise Policy 2022,Delhi Excise Policy Upsc,TRS MLC Kavitha

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. తాజాగా ఈడీ తన రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరుని చేర్చడం రాష్ట్రవ్యాపంగా చర్చనీయాంశం అవుతోంది. అధికార టీఆర్ఎస్ మరియు బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే గురువారం ఉడయమే దీనిపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. కేసులకు భయపడేది లేదని, కావాలంటే అరెస్ట్ చేసుకోండని సవాల్ చేశారు. ఈ క్రమంలో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

గురువారం ఆయన బీజేపీ కార్యకర్తలతో కలిసి నాంపల్లిలోని అమర వీరుల స్థూపం వద్ద తెలంగాణ మలిదశ ఉద్యమ కారుడు పుట్టకొక్కుల (పోలీస్) కిష్టయ్య 13వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన కుమార్తె పేరు ఎందుకు ఉందో సీఎం కేసీఆర్ చెప్పాలని కోరారు. దీనిలో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందో, లేదో విచారణలో తేలుతుందని, ఒకవేళ ఉందని తేలితే శిక్ష తప్పదని అన్నారు. ఇక ఈ వ్యవహారంతో దేశ రాజధానిలో తెలంగాణ రాష్ట్రం పరువు పోయిందని, అక్కడి లిక్కర్ పాలసీలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం వీళ్ళకి ఏమొచ్చిందని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 17 =