పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం?

Petrol - Diesel Prices are Likely to Rise Further?,Mango News,Petrol - Diesel Prices Hiked by Over Rs 2 After Govt Raises Excise Duty,Petrol - Diesel Prices To Rise Further,Full Prices Set To Soar?

భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 5 న 2019-2020 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రకటించారు. ఈ బడ్జెట్ ప్రకటన అనంతరం, భారతదేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోల్ లీటరుకు 2.45 రూపాయలు, డీజిల్ ధర 2.36 రూపాయలు పెరిగాయి. 2019-2020 బడ్జెట్‌కు నిధులు సమకూర్చడానికి పన్నుల పెంపు ప్రకటించిన తరువాత ఈ ధరలు పెరిగాయి. ఈ బడ్జెట్ లో పెట్రోల్ మరియు డీజిల్ పై రూ. 1 ఎక్సైజ్ సుంకం పెంచారు. మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోల్ మరియు డీజిల్‌పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని ప్రకటించిన తరువాత హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ షేర్లు క్షీణించాయి.

ప్రభుత్వం బడ్జెట్ ప్రకటనకు విభిన్నంగా ఒక కొత్త ఆర్ధిక బిల్లుని ప్రవేశపెట్టారు, ఈ బిల్లు ద్వారా మళ్ళీ సుంకం పెంచే అవకాశం ఉంది, దీనితో త్వరలో పెట్రోల్ మరియు డీజిల్ పై మరో ఐదు రూపాయలు పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ పై పెంపు వలన ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది, సామాన్య ప్రజలు, వాహనదారులు పెరిగిన ధరలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =