ఢిల్లీలో కర్తవ్య పథ్ ను ప్రారంభించి, నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

PM Modi Inaugurates Kartavya Path and Unveils Statue of Netaji Subhas Chandra Bose at India Gate, PM Modi To Inaugurate Kartavya Path , PM Modi Unveils Netaji Subhas Chandra Bose Statue, PM Modi Subhas Chandra Bose Statue Inauguration, PM Modi Kartavya Path, Kartavya Path Scheme, Mango News, Mango News Telugu, Kartavya Path, PM Narendra Modi, PM Narendra Modi Latest News And Updates, Netaji Subhas Chandra Bose Statue at India Gate

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ గురువారం సాయంత్రం ఢిల్లీలో “కర్తవ్య పథ్” ను ప్రారంభించారు. ఢిల్లీలోని రాజ్ పథ్, సెంట్రల్ విస్టా మార్గాలను ఇకపై కర్తవ్య పథ్ గా పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే ముందుగా ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో పాల్గొన్న కార్మికులతో ప్రధాని మోదీ సంభాషించారు. ఈ ప్రాజెక్ట్‌లో పనిచేసిన వారందరినీ జనవరి 26 రిపబ్లిక్ డే పరేడ్‌కు ఆహ్వానిస్తామని ప్రధాని మోదీ వారికీ తెలిపారు. ఆధునీకరించిన సెంట్రల్ విస్టా అవెన్యూ ఎగ్జిబిషన్‌ ను కూడా ప్రధాని వీక్షించారు.

గత సంవత్సరాలుగా ఉన్న రాజ్‌పథ్ మరియు సెంట్రల్ విస్టా అవెన్యూ పరిసర ప్రాంతాలను పూర్తిగా అన్ని సదుపాయాలతో ఆధునీకరించారు. ఇటీవలే ఈ ప్రాంతాన్ని కర్తవ్య పథ్ గా నామకరణం చేయాలని నిర్ణయించగా, చారిత్రాత్మక కార్యక్రమంగా నేడు కర్తవ్య పథ్ ను ప్రధాని ప్రారంభించారు. కర్తవ్య పథ్ మార్గంలో అందమైన ప్రకృతి దృశ్యాలు, నడక మార్గాలతో కూడిన పచ్చిక బయళ్ళు, పచ్చని ప్రదేశాలు, పునరుద్ధరించిన కాలువలు, కొత్త సౌకర్యాల బ్లాక్‌లు, మెరుగైన సంకేతాలు మరియు వెండింగ్ కియోస్క్‌లు ఏర్పాటు చేశారు. కొత్త పాదచారుల అండర్‌పాస్‌లు, మెరుగైన పార్కింగ్ స్థలాలు, కొత్త ఎగ్జిబిషన్ ప్యానెల్‌లు మరియు అప్‌గ్రేడ్ చేసిన నైట్ లైటింగ్ పబ్లిక్ అనుభవాన్ని మెరుగుపరిచే కొన్ని ఇతర ఫీచర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

అదేవిధంగా ఈ ఏడాది ప్రారంభంలో పరాక్రమ్ దివస్ (జనవరి 23) సందర్భంగా నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రదేశంలోనే ఇండియా గేట్ వద్ద నేడు ప్రధాని మోదీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నేతాజీకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నేతాజీ విగ్రహం 28 అడుగుల ఎత్తైన ఏకశిలా గ్రానైట్ రాయి నుండి చెక్కబడగా, 65 ఎంటీల బరువు కలిగి ఉంది. గ్రానైట్‌తో చేసిన ఈ విగ్రహం మన స్వాతంత్య్ర పోరాటానికి నేతాజీ చేసిన అపారమైన సహకారానికి తగిన నివాళి మరియు దేశం ఆయనకు రుణపడి ఉండేందుకు చిహ్నంగా ఉంటుందని పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =