కరోనాపై పోరులో మరో ముందడుగు, మోడెర్నా‌ కరోనా వ్యాక్సిన్ కు అనుమతి

US FDA Clears Moderna COVID-19 Vaccine for Emergency Use,US Clears Moderna COVID-19 Vaccine For Emergency Use,United States Clears Moderna COVID-19 Vaccine For Emergency Use,US Clears Moderna Vaccine For COVID-19,US Approves Moderna COVID-19 Vaccine For Emergency Use,United States Clears Moderna Vaccine For COVID-19,US Authorizes Moderna COVID-19 Vaccine For Emergency Use,FDA Panel Endorses Moderna COVID-19 Vaccine,US Clears Moderna Vaccine,Moderna Covid Vaccine FDA Approved For Emergency Use,FDA Approves Moderna Covid Vaccine,Mango News,Mango News Telugu,FDA Clears Moderna COVID Vaccine,US FDA Clears Moderna COVID-19 Vaccine,Moderna,Moderna COVID-19 Vaccine

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫైజర్ సంస్థ, జర్మన్ కి చెందిన బయోఎన్‌టెక్‌ సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ను‌ అత్యవసర వినియోగానికి అమెరికాతో పాటుగా యునైటెడ్ కింగ్ డమ్, బహ్రైన్‌, కెనడా, సౌదీ అరేబియా, మెక్సికో దేశాలు అనుమతి ఇచ్చాయి. తాజాగా మరో కరోనా వ్యాక్సిన్ కూడా అమెరికా అనుమతి ఇచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా రూపొందించిన ఎంఆర్‌ఎన్‌ఏ-1273 కరోనా వ్యాక్సిన్ కి కూడా అత్యవసర వినియోగానికి సంబంధించి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతి ఇచ్చింది.

దీంతో అమెరికాలో రెండు కీలక కరోనా వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చినట్లయింది. “అభినందనలు, మోడెర్నా వ్యాక్సిన్ ఇప్పుడు అందుబాటులో ఉంది!” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్ చేశారు. ముందుగా అమెరికాలో వేల మంది వాలంటీర్లపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించి, ప్రైమరీ ఫలితాల విశ్లేషణ తర్వాత తమ వ్యాక్సిన్ 94.1 శాతం సమర్థతతో పనిచేస్తున్నట్లు వెల్లడయిందని మోడెర్నా సంస్థ ప్రకటించింది. పూర్తిస్థాయి ఫలితాల విశ్లేషణ అనంతరం తీవ్ర కరోనా లక్షణాలతో బాధపడే వారిపై తమ వ్యాక్సిన్ 100 శాతం సమర్ధవంతంగా పనిచేస్తుందని ప్రకటించారు. మోడెర్నా కరోనా వ్యాక్సిన్ కు ఎఫ్‌డీఐ అనుమతి లభించిన నేపథ్యంలో బాధితులకు వ్యాక్సిన్ అందించేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =