ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

PM Narendra Modi Greets the People of Uttarakhand on their Statehood Day, Prime Minister Narendra Modi ,Congratulated People Of Uttarakhand, Uttarakhand State Day,Mango News,Mango News Telugu,Uttarakhand Statehood Day,Prime Minister Narendra Modi,PM Narendra Modi,PM Modi Latest News And Updates,Uttarakhand Statehood Day Latest News And Live Updates,PM Modi News and Updates,Prime Minister Of India

ఉత్తరాఖండ్ రాష్ట్రం 2000, నవంబర్ 9 ఏర్పడిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్ ఏర్పడి నేటితో 22 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఉత్త‌రాఖండ్ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. “ఉత్తరాఖండ్ ప్రజలకు రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఇది ప్రకృతి మరియు ఆధ్యాత్మికతతో దగ్గరి అనుబంధం ఉన్న రాష్ట్రం. ఈ రాష్ట్ర ప్రజలు అనేక రంగాలలో దేశ నిర్మాణానికి అద్భుతమైన కృషి చేస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో ఉత్తరాఖండ్ పురోగమిస్తూనే ఉంటుంది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

అలాగే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ చేస్తూ, “ప్రియమైన ప్రజలారా, ఉత్తరాఖండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ విజయవంతమైన నాయకత్వంలో, రాష్ట్రం కోసం పోరాడిన వారి కల ప్రకారం ప్రత్యేక రాష్ట్రం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అంకితం చేయబడింది. ప్రగతిశీల మరియు స్వావలంబన కలిగిన ఉత్తరాఖండ్‌ను నిర్మించడానికి మేము వివిధ ప్రజా సంక్షేమ పథకాల ద్వారా సమాజంలోని ప్రతి వర్గానికి నిరంతరం సాధికారత కల్పిస్తున్నాము. సంకల్ప్ నయే ఉత్తరాఖండ్ కా అనే మంత్రాన్ని పురస్కరించుకుని ఉత్తరాఖండ్‌ను ఆదర్శ రాష్ట్రంగా మార్చేందుకు మనమందరం దోహదపడాలి. ఈ రోజుతో ‘యువ ఉత్తరాఖండ్’ స్థాపించి 22 సంవత్సరాలు పూర్తయింది మరియు ప్రగతి పథంలో పయనిస్తూ నిరంతరం కొత్త లక్ష్యాలను సాధిస్తున్నాము” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 1 =