భారతదేశం యొక్క 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా త్రివిధ దళాల నుంచి రాష్ట్రపతి గౌరవవందనం స్వీకరించి పరేడ్‌ను ప్రారంభించారు. కాగా రాష్ట్రపతి ముర్ముకు ఇవే తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలు కావడం విశేషం. ఇక ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళులర్పించారు. అలాగే ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎల్-సిసి ప్రత్యేక అతిథిగా విచ్చేసారు. వేడుకల సందర్భంగా ఆర్మీ, నేవీ, వైమానిక దళం, పోలీసులు మరియు పారా మిలటరీ దళాల రెజిమెంట్లు రాజ్‌పథ్ మైదానంలో చేసిన కవాతు ఆకట్టుకుంది. ఇక భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా వివిధ మంత్రిత్వ శాఖలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన శకటాల ప్రదర్శన అబ్బురపరిచింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE