నేటి నుంచి 3 రోజుల పాటు త్రిపుర, అస్సాం రాష్ట్రాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

President Droupadi Murmu will Visit Tripura and Assam from October 12 to 14, President Droupadi Murmu will Visit Tripura, President Droupadi Murmu will Visit Assam, President Droupadi Murmu, Mango News, Mango News Telugu, President Droupadi Murmu Tour, President Droupadi Murmu Latest News And Updates, President Droupadi Murmu, Indian President Droupadi Murmu, President Murmu To Visit Tripura and Assam, President of India to Visit Tripura, President Murmu On Three-Day Visit To Tripura, President Droupadi Murmu

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్టోబర్ 12 నుండి అక్టోబర్ 14 వరకు 3 రోజుల పాటు త్రిపుర, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ముందుగా బుధవారం త్రిపుర రాజధాని అగర్తలాకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు త్రిపుర గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్య మరియు ముఖ్యమంత్రి డా.మాణిక్ సాహా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా అక్టోబర్ 12, బుధవారం ఉదయం త్రిపుర స్టేట్ జ్యుడీషియల్ అకాడమీని రాష్ట్రపతి ప్రారంభిస్తారు మరియు అగర్తలాలోని నర్సింగర్‌లో త్రిపుర నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తారు.

అనంతరం క్యాపిటల్ కాంప్లెక్స్, అగర్తలా వద్ద ఎమ్మెల్యే హాస్టల్‌ను ఆమె వర్చువల్ గా ప్రారంభించి, రోడ్లు, పాఠశాలలు, విద్యార్థుల హాస్టళ్లకు సంబంధించి త్రిపుర ప్రభుత్వం యొక్క వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే మహారాజా బీరేంద్ర కిషోర్ మాణిక్య మ్యూజియం అండ్ కల్చరల్ సెంటర్ మరియు రవీంద్ర సత్బర్షికి భవన్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) అగర్తలాకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం అగర్తలాలోని టౌన్ హాల్‌లో త్రిపుర ప్రభుత్వం రాష్ట్రపతి గౌరవార్థం నిర్వహించే పౌర రిసెప్షన్‌కు హాజరవుతారు. అక్టోబరు 13, గురువారం ఉదయం గౌహతి-కోల్‌కతా-గౌహతి రైలును అగర్తలా రైల్వే స్టేషన్‌కు మరియు అగర్తలా-జిరిబామ్-అగర్తలా జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను మణిపూర్‌లోని ఖోంగ్‌సాంగ్ వరకు ప్రత్యేక పొడిగింపును రాష్ట్రపతి జెండా ఊపి ప్రారంభిస్తారు.

అనంతరం అస్సాంలోని గౌహతికి చేరుకొని, ఐఐటీ గౌహతిలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు అస్సాం ప్రభుత్వం యొక్క వివిధ ప్రాజెక్టులకు రాష్ట్రపతి వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వీటిలో సూపర్‌కంప్యూటర్ సౌకర్యం పరమ్ కమ్రూప మరియు ఐఐటీ గౌహతిలో హై పవర్ మైక్రోవేవ్ కాంపోనెంట్‌ల రూపకల్పన, అభివృద్ధి కోసం సౌకర్యం, ధుబ్రి వద్ద వైద్య కళాశాల అండ్ ఆసుపత్రి మరియు జోనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) డిబ్రూఘర్ (అస్సాం) మరియు జబల్పూర్ (మధ్యప్రదేశ్) ఉన్నాయి. గురువారం సాయంత్రం గౌహతిలోని అస్సాం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో రాష్ట్రపతి గౌరవార్థం నిర్వహించే పౌర రిసెప్షన్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు రాష్ట్రపతి హాజరుకానున్నారు.

ఇక అక్టోబరు 14, శుక్రవారం ఉదయం అస్సాం ప్రభుత్వం మరియు రోడ్డు రవాణా అండ్ హైవేలు, పెట్రోలియం అండ్ సహజ వాయువు మరియు రైల్వేల కేంద్ర మంత్రిత్వ శాఖల వివిధ ప్రాజెక్టులకు రాష్ట్రపతి వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వీటిలో ఆధునిక సౌకర్యాలతో మోడల్ అంగన్‌వాడీ కేంద్రాల ప్రారంభం మరియు మిషన్ సౌభాగ్య, సిల్చార్‌లోని మొయినార్‌బాండ్‌లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క రైల్-ఫెడ్ పెట్రోలియం నిల్వ డిపో ప్రారంభోత్సవం, రెండు హైవే ప్రాజెక్టులు, అస్సాంలోని టీ గార్డెన్ ప్రాంతాల్లో 100 మోడల్ సెకండరీ పాఠశాలలకు శంకుస్థాపన, అగ్తోరి, గౌహతిలో రెండు హైవే ప్రాజెక్టులు మరియు ఆధునిక కార్గో-కమ్-కోచింగ్ టెర్మినల్ శంకుస్థాపన వంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − nine =