భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణ, అమరులైన ముగ్గురు జవాన్లు

3 Indian Soldiers Killed, 3 Indian Soldiers Killed at Border Clash, China kills three Indian soldiers, China kills three Indian soldiers in border clash, India-China Border, India-China Border Tensions, India-China border tensions LIVE Updates

భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య జూన్ 15, సోమవారం రాత్రి తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరుదేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న తరుణంలో లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. కాగా ఘటనలో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్‌ స్థాయి అధికారి,ఇద్దరు సైనికులు అమరులయ్యారు. మరోవైపు‌ ఐదుగురు చైనా సైనికులు మరణించగా, 11 మంది గాయపడినట్లు సమాచారం. అయితే మరణాల సంఖ్యను చైనా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. భారత్-చైనా సరిహద్దుల్లో 1975 తర్వాత దాదాపు 45 ఏళ్లకి ఘర్షణలు చోటుచేసుకుని ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌ తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట వాసి. ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గత ఏడాదిన్నరగా ‌ సంతోష్‌ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఈ ఘటన పరిస్థితులపై ఈ రోజు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్ష నిర్వహించారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌ జయశంకర్‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, జనరల్‌ ఎంఎం నరవణే, అడ్మిరల్‌ కబీర్‌ సింగ్‌, ఎయిర్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ బదౌరియా, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =