పద్మ అవార్డులు-2023: చినజీయర్ స్వామికి పద్మభూషణ్‌, కీరవాణికి పద్మశ్రీ

Padma Awards-2023 Centre Announces 6 Padma Vibhushan 9 Padma Bhushan and 91 Padma Shri Awards,Padma Awards 2023,Centre Announces 6 Padma Vibhushan, 9 Padma Bhushan,91 Padma Shri Awards,Mango News,Mango News Telugu,SL Bhairappa Literature and Education Karnataka,Kumar Mangalam Birla Trade and Industry Maharashtra,Deepak Dhar Science and Engineering Maharashtra,Vani Jayaram Art Tamil Nadu,Chinajiyar Swami Spiritual Telangana,Suman Kalyanpur Art Maharashtra,Kapil Kapoor Literature and Education Delhi,Sudhamurthy Social Work Karnataka,Kamlesh D Patel Spiritual Telangana,MM Keeravani Music Padmashri

దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పుర‌స్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2023 సంవత్సరానికి గాను ఆరుగురికి పద్మవిభూషణ్‌, తొమ్మిది మందికి పద్మభూషణ్‌, 91 మందికి పద్మశ్రీ పురస్కారాలను కలిపి దేశంలోని పలు రాష్ట్రాల ప్రముఖులకు మొత్తం 106 పద్మ పురస్కారాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అవార్డు గ్రహీతలలో 19 మంది మహిళలు ఉన్నారు. విదేశీయులు/ఎన్ఆర్ఐ/పీఐఓ/ఓసీఐ చెందిన వారు ఇద్దరు ఉండగా, ఏడుగురు మరణానంతర అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు.

తెలంగాణ నుంచి ఇద్దరికీ పద్మ భూషణ్‌తో పాటు ముగ్గురుకి పద్మశ్రీ అవార్డులు లభించాయి. తెలంగాణ నుంచి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌ స్వామి, శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేశ్‌ డి పటేల్‌ పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. అలాగే మోదడుగు విజయ్‌ గుప్తా (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌), హనుమంతరావు పసుపులేటి (వైద్యం), బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం, విద్య) విభాగాల్లో పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఆర్ట్ విభాగంలో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, సీవీ రాజు, కోటా సచ్చిదానంద శాస్త్రిలకు, సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో గణేశ్‌ నాగప్ప కృష్ణరాజనగర, అబ్బారెడ్డి నాగేశ్వరరావులకు, సోషల్ వర్క్ విభాగంలో సంకురాత్రి చంద్రశేఖర్‌ కు, సాహిత్యం, విద్య విభాగంలో ప్రకాశ్‌ చంద్రసూద్‌ కు పద్మశ్రీ అవార్డు వరించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొత్తం 12 పద్మ అవార్డులు దక్కాయి. ఇక మహారాష్ట్ర నుంచి ప్రముఖ నటి రవీనా టాండన్ పద్మశ్రీ అవార్డు పొందారు. ఈ అవార్డులను సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి/ఏప్రిల్‌లో రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఉత్సవ కార్యక్రమాలలో భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు.

పద్మవిభూషణ్‌ అవార్డు విజేతలు:

  1. బాలకృష్ణ జోషీ (మరణానంతరం) – ఆర్కిటెక్చర్ – గుజరాత్‌
  2. జాకీర్‌ హుస్సేన్‌ – ఆర్ట్ – మహారాష్ట్ర
  3. ఎస్‌.ఎం.కృష్ణ – పబ్లిక్‌ అఫైర్స్‌ – కర్ణాటక
  4. దిలీప్ మహాలనబిస్‌ (మరణానంతరం) – వైద్యరంగం – పశ్చిమబెంగాల్‌
  5. శ్రీనివాస్‌ వర్థన్‌ – సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్ – యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (ఎన్ఆర్ఐ)
  6. ములాయం సింగ్‌ యాదవ్‌ (మరణానంతరం) – పబ్లిక్‌ అఫైర్స్‌ – ఉత్తర్ ప్రదేశ్

పద్మభూషణ్‌ అవార్డు విజేతలు:

  1. ఎస్ఎల్‌ భైరప్ప – లిటరేచర్‌ అండ్ ఎడ్యుకేషన్ – కర్ణాటక
  2. కుమార మంగళం బిర్లా – ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ – మహారాష్ట్ర
  3. దీపక్‌ ధార్‌ – సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్ – మహారాష్ట్ర
  4. వాణీ జయరాం – ఆర్ట్ – తమిళనాడు
  5. చినజీయర్‌ స్వామి – ఆధ్యాత్మికం – తెలంగాణ
  6. సుమన్‌ కల్యాణ్‌పూర్‌ – ఆర్ట్ – మహారాష్ట్ర
  7. కపిల్‌ కపూర్‌ – లిటరేచర్‌ అండ్ ఎడ్యుకేషన్ – ఢిల్లీ
  8. సుధామూర్తి – సోషల్ వర్క్ – కర్ణాటక
  9. కమలేశ్‌ డి పటేల్‌ – ఆధ్యాత్మికం – తెలంగాణ.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =