ఒలింపిక్స్ లో కమల్‌ప్రీత్ కౌర్ అత్యుత్తమ ప్రదర్శన, మహిళల డిస్కస్ త్రోలో ఫైనల్‌ కు అర్హత

India’s Kamalpreet Kaur enters Women’s Discus Throw Final, Kamalpreet Kaur, Kamalpreet Kaur Enters into Women’s Discus, Kamalpreet Kaur Enters into Women’s Discus Throw Final, KamalPreet Kaur enters women’s discuss throw, Mango News, Olympics, Tokyo Olympics, Tokyo Olympics 2020, Tokyo Olympics 2020 Day 8 Live Updates, tokyo olympics 2021, Tokyo Olympics 2021 Live Updates, Tokyo Olympics Live Updates, Tokyo Olympics News, Tokyo Olympics Updates

టోక్యో ఒలింపిక్స్-2020 క్రీడల్లో భారత్ నుంచి మరో అద్భుత ప్రదర్శన నమోదైంది. భారత క్రీడాకారిణి కమల్‌ప్రీత్ కౌర్ మహిళల డిస్కస్ త్రో లో ఫైనల్‌ కు దూసుకెళ్లింది. శనివారం ఉదయం జరిగిన మహిళల డిస్కస్ త్రో క్వాలిఫికేషన్‌ రౌండ్‌ లో ఆమె అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. మొదటి ప్రయత్నంలో 60.29 మీటర్లు విసరగా, రెండో ప్రయత్నంలో 63.97 మీటర్లు, ఇక మూడో ప్రయత్నంలో డిస్కస్‌ను ఏకంగా ఫైనల్ అర్హతకు అవసరమైన 64 మీటర్లు విసిరింది.

దీంతో క్వాలిఫికేషన్‌ రౌండ్‌ మొత్తం ప్రదర్శనలో అమెరికా క్రీడాకారిణి వాలరీ అల్మన్‌ తర్వాత రెండో స్థానంలో నిలిచినప్పటికి కమల్‌ప్రీత్ కౌర్ నేరుగా ఫైనల్ కు అర్హత సాధించింది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో తొలి 12 స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్‌ కు ఎంపికవనుండగా, ఆగస్టు 2న ఫైనల్ జరుగుతుంది. ఫైనల్ లో కూడా కమల్‌ప్రీత్ కౌర్ అత్యుత్తమ ప్రదర్శన కొనసాగిస్తే మెడల్ సాధించే అవకాశముంది. ఇక డిస్కస్ త్రో లో అంచనాలు ఉన్న సీనియర్ భారత క్రీడాకారిణి సీమా పునియా 16వ స్థానంతో సరిపెట్టుకుని, ఫైనల్ కు అర్హత సాధించలేకపోయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here