రామప్ప దేవాలయం చుట్టూ కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

Telangana’s Ramappa temple, Fresh push for heritage tag to Ramappa temple, Mango News, Minister Srinivas Goud held Review on UNESCO Heritage Site, Minister Srinivas Goud held Review on UNESCO Heritage Site Ramappa Temple, Panel to protect Ramappa temple, Ramappa Temple, Ramappa Temple get Heritage status soon, Ramappa Temple in Palampet, Ramappa Temple News, Telangana Sports Minister Srinivas Goud, UNESCO Heritage Site Ramappa Temple, UNESCO World Heritage Status for Ramappa Temple

తెలంగాణ రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం నాడు యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయంపై ఆర్కియాలజీకల్ సర్వే ఆఫ్ ఇండియా, హెరిటేజ్ తెలంగాణ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో రామప్ప దేవాలయంనును యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించినందుకు హెరిటేజ్ తెలంగాణ శాఖ తరుపున, సీఎం కేసీఆర్ పక్షాన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. రామప్ప దేవాలయంపై యునెస్కో సూచించిన గైడ్ లైన్స్ పై డిసెంబర్ 2022లో సమర్పించాల్సిన సమగ్ర నివేదికపై మంత్రి చర్చించి పలు సూచనలను, సలహాలను చేశారు.

కాకతీయల కాలంనాటి అద్భుతమైన కళాసంపదను, తెలంగాణ సంస్కృతిని యునెస్కో సంస్థ గుర్తించిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వేల ఏళ్ల నాటి చారిత్రాత్మక సంపద, ఎన్నో అత్యద్భుతమైన ప్రదేశాలున్నాయన్నారు. రామప్ప దేవాలయంను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తూ కొన్ని సూచనలు చేసిందన్నారు. వచ్చే సంవత్సరం డిసెంబర్-2022 లోగా వారు సూచించిన సూచనలు యునెస్కో కు సమర్పించిన దోజియర్/పూర్తి సమాచార సేకరణలో పొందుపరిచిన సమాచారానికి లోబడి ఉండాలన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.

కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్ గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్దం చేయాలి:

ఈ సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయం సమీపంలో వున్న చారిత్రాత్మక కట్టడాలు, దేవాలయాలను సంరక్షించి, కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్ గా అభివృద్ధి చేయడానికి తగిన ప్రణాళికలను సిద్దం చేయాలని తెలంగాణ హెరిటేజ్ శాఖ అధికారులను ఆదేశించారు. రామప్ప దేవాలయంలో కేంద్ర ఆర్కియాలజీ శాఖకు చెందిన స్థలం వాటి సరిహద్దులు గుర్తించాలన్నారు. తెలంగాణ హెరిటేజ్ శాఖ అధీనంలో వున్న స్థలం అభివృద్ధి చేసేందుకు, తీసుకునే చర్యలపై మంత్రి చర్చించి పలు సూచనలు సలహాలు చేయడం జరిగింది. రామప్ప దేవాలయం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేవాలయాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్దం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రామప్ప దేవాలయం, చెరువు, కాలువలను చట్టబద్ధత కల్పించే విషయంపై యునెస్కో వారికి వచ్చే సంవత్సరం డిసెంబర్-2022 లోపల ప్రణాళికలను సమర్పించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

నీటి పారుదల కాలువల పరిధిలో ఉన్న కాకతీయుల కాలంలోని నిర్మించబడిన చారిత్రక కట్టడాలు, దేవాలయాలు వాటి సంరక్షణకై చర్యలను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రామప్ప దేవాలయం అభివృద్ది ప రూపోందించిన నివేదికను సీఎం కేసీఆర్ తో చర్చించి తదుపరి చర్యలను తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ స్మిత ఎస్.కుమార్, వైఏటీసీ జాయింట్ సెక్రటరీ కె.రమేష్, హెరిటేజ్ తెలంగాణ ఉన్నతాధికారులు నారాయణ, రాములు నాయక్, నాగరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =