రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్ ను మళ్ళీ తిరస్కరించిన కోర్టు

Mumbai Special Court, Mumbai Special Court Denies Bail to Actress Rhea Chakraborty, Rhea Chakraborty, Rhea Chakraborty Drug Case, sushant singh rajput, Sushant Singh Rajput Case, sushant singh rajput case rhea, Sushant Singh Rajput Death, Sushant Singh Rajput Death Case, sushant singh rajput news, Verdict In Rhea Chakraborty Drug Case

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్రగ్స్‌ కోణంపై నార్కొటిక్స్‌ కంట్రోల్ ‌బ్యూరో (ఎన్‌సీబీ) దర్యాప్తు జరిపి సుశాంత్‌ సన్నిహితురాలు, నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తితో పాటుగా మరో నలుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముందుగా ముంబయిలోని స్పెషల్ కోర్టు రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించి, 14 రోజుల పాటుగా జ్యుడిషియల్‌ కస్టడీ విధించడంతో, ఆమెను బైకుల్లా మహిళా జైలుకు తరలించారు. తాజాగా రెండోసారి కూడా రియా సహా ఐదుగురి బెయిల్ పిటిషన్లను కోర్టు‌ తిరస్కరించింది. శుక్రవారం నాడు వారి బెయిల్ పిటిషన్లపై కోర్టు విచారణ జరిపి, నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టెన్సెస్‌ (ఎన్‌డీపీఎస్‌) చట్టం ప్రకారం బెయిల్ ను తిరస్కరిస్తున్నట్టు తెలిపింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here