కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కర్ణాటక సీఎం యడియూరప్ప కు కరోనా పాజిటివ్‌

amit shah, Amit Shah Coronavirus, Amit Shah Coronavirus Positive, Amit Shah Tests Coronavirus Positive, Amit Shah Tests Positive, BS Yediyurappa, Coronavirus, Home Minister of India, Karnataka CM, Karnataka CM BS Yediyurappa, Karnataka CM Coronavirus, Karnataka CM Tests COVID-19 Positive

కరోనావ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీల కీలక నాయకులు, సినీ ప్రముఖులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “కరోనా యొక్క ప్రారంభ లక్షణాలు కనించడంతో పరీక్షలు చేయించుకున్నాను. రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉంది, కానీ వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాను. గత కొద్ది రోజులుగా నాతో సంప్రదించిన వారంతా మిగతా వారితో వేరుగా ఉండి, కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నానని” హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.

మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప కూడా తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. “కరోనా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది. నేను బాగానే ఉన్నాను. అయితే వైద్యుల సూచనల మేరకు ముందుజాగ్రత్తగా ఆసుపత్రిలో చేరాను. ఇటీవల నాతో సంప్రదించిన వారు గమనించుకొని, స్వీయ నిర్బంధాన్ని పాటించాలని అభ్యర్థిస్తున్నానని” సీఎం యడియూరప్ప పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here