అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు: ట్రంప్, జో బైడెన్ మధ్య హోరాహోరీ పోరు

2020 Election Live Updates, America President Donald Trump, Biden 17 and Counting Underway, Donald Trump, Trump Wins 18 States, US election 2020, US Election 2020 Live, US Election 2020 LIVE Updates, US Election Results 2020, US Elections 2020 News, US Elections 2020 Updates, US Elections Updates, US Elections Updates 2020

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ పూర్తయిన అనంతరం ఓట్ల లెక్కింపు పక్రియ కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ మధ్య పోరు హోరాహోరీగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు బైడెన్‌కు 209 ఎలక్టోరల్‌ ఓట్లు రాగా, ట్రంప్‌నకు 112 ఓట్లు వచ్చాయి. అయితే కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉండడంతో ఫలితాలు వెలువడే కొద్దీ ఉత్కంఠ పెరుగుతుంది. అలాగే పాపులర్‌ ఓట్లలో ట్రంప్‌, ఎలక్టోరల్‌ ఓట్లలో బైడెన్ ముందంజలో ఉన్నారు. ఇప్పటికి ఫ్లోరిడా సహా 18 రాష్ట్రాల్లో ట్రంప్, 17 రాష్ట్రాల్లో జో బిడెన్ విజయం సాధించారు.

అమెరికాలో 50 రాష్ట్రాల్లో మొత్తం 538 ఎలక్టోరల్‌ ఓట్లు ఉండగా, 270 ఎలక్టోరల్‌ ఓట్లు గెలుచుకున్న వారు అధ్యక్ష పీఠం దక్కించుకుని శ్వేతసౌథంలోకి అడుగుపెట్టనున్నారు. ముఖ్యంగా టెక్సాస్‌, న్యూయార్క్‌, కాలిఫోర్నియా, ఫ్లోరిడా, ఇల్లినోయ్‌,పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో ఎలక్టోరల్‌ ఓట్లు ఎక్కువ ఉండడంతో ఆయా రాష్ట్రాల్లో ఎక్కువ ఓట్లు సాధిస్తే విజయావకాశాలు మెరుగా ఉండనున్నాయి. పలు రాష్ట్రాల్లో ట్రంప్, బైడెన్ మధ్య తేడా స్వల్పంగా ఉంటుండడంతో ఫలితంపై ఆసక్తి పెరుగుతుంది. ప్రపంచదేశాలను ప్రభావితం చేసే ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో మరి కొద్దీ గంటల్లో తేలనుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − six =