సెమీస్ లో బోల్తా కొట్టిన భారత్, తీవ్ర నిరాశలో అభిమానులు

Mango News,New Zealand Win Against India In World Cricket Cup Semi Final, New Zealand stun India to win thrilling Cricket World Cup Semi Final, India Vs New Zealand Highlights, India Vs New Zealand World Cup 2019 Semi Final Match Highlights, New Zealand bowlers shock India, India vs New Zealand World Cup 2019, India Losess match Against New zeaLand, 2019 World Cup Latest Updates
  • ప్రపంచకప్ లో ముగిసిన భారత్ పోరాటం
  • అనూహ్యంగా న్యూజిలాండ్ చేతిలో ఓటమి
  • రవీంద్రజడేజా అద్భుత పోరాటం
  • వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్ కి చేరిన న్యూజిలాండ్

క్రికెట్ ప్రపంచకప్ 2019 లో నిన్న జరిగిన తోలి సెమీఫైనల్ లో న్యూజిలాండ్ తో తలపడిన భారత్ జట్టు 18 పరుగుల తేడాతో పరాజయం పొందింది. విజయం సాధించిన న్యూజిలాండ్ ప్రపంచకప్ లో వరుసగా రెండోసారి ఫైనల్ కి చేరుకుంది. వర్షం వలన మంగళవారం పూర్తి కావాలిసిన ఈ మ్యాచ్, బుధవారానికి వాయిదా పడింది. ఇంగ్లాండ్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానంలో ఈ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగింది, బుధవారం 46.1 ఓవర్లు నుంచి ఆట కొనసాగించిన న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లు పూర్తి అయ్యేసరికి 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ మొదలుపెట్టిన భారతజట్టు ఎవరు ఊహించని విధంగా 5 పరుగులకే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కే ఎల్ రాహుల్ వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది. తరువాత వచ్చిన రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా కొంతసేపు న్యూజిలాండ్ బౌలర్లు ని నిలువరించి పరుగులు సాధించినా కూడ ఒత్తిడి తో అవుట్ అయ్యి పెవిలియన్ బాట పట్టారు.

96పరుగులకే 6 వికెట్లు పడిన సమయంలో క్రీజులోకి వచ్చిన జడేజా, ధోని నిలకడగా ఆడుతూ అద్భుత ప్రదర్శన చేసారు. ముఖ్యంగా రవీంద్రజడేజా అవకాశం చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్స్ లు కొడుతూ మళ్ళీ అభిమానుల్లో ఆశలు రేకేత్తించాడు, ధోని సహాయం తో మరో వికెట్ పడకుండా చేసిన పోరాటం, అభిమానుల్లో చాల కాలం పాటు గుర్తుంటుంది. చివరి మూడు ఓవర్లు కి వచ్చేసరికి రన్ రేట్ పెరగడంతో భారీ షాట్ కి ప్రయత్నించిన జడేజా (77) ఔట్  అయ్యాడు. చివరి 2 ఓవర్లు కి 31 పరుగులు రాబట్టాల్సిన తరుణంలో, 49 వ ఓవర్ మొదటి బంతికి సిక్స్ కొట్టిన ధోని (50), అదే ఓవర్లో మూడు బంతికి న్యూజిలాండ్ ఓపెనర్ గుప్తిల్ విసిరిన డైరెక్ట్ త్రో తో రన్ అవుట్ అయ్యి వెనుదిరగడంతో, భారత్ క్రికెట్ ప్రపంచ కప్ ఆశలు పూర్తిగా నీరుగారిపోయాయి. ఐసీసీ కీలక ప్రపంచకప్ టోర్నీలలో 2015, 2017, 2019 లలో ఇలా సెమీఫైనల్ లో భారత్ జట్టు వెనుదిరగడంతో, అభిమానులు తీవ్ర నిరాశకి లోనయ్యారు. టోర్నమెంట్ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసిన భారత్ జట్టు, ఇలా అనూహ్యంగా ఓడిపోవడం తో క్రికెటర్లు కూడ కొంతమంది కన్నీరు పెట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here