అసెంబ్లీ లో చంద్రబాబు, వైఎస్ జగన్ మధ్య మాటల యుద్ధం

Andhra Assembly Budget Meeting Udates, Andhra Pradesh Political News, Ap Assembly Budget 2019 Updates, Assembly Budget Meeting Latest News, Chandrababu VS YS Jagan, CM Jagan Vs Ex CM Chandrababu in AP Assembly, CM YS Jagan satirical comments on TDP chief, Mango News, War Of Words Between Chandrababu and Jagan In AP Assembly, YS Jagan Mohan Latest News

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి, ఈ నెల 30 వరకు జరుగుతాయి. సభ మొదలైన కొద్దీ సేపటికే అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలైంది, ఆంధ్రప్రదేశ్ లో చేపడుతున్న ప్రాజెక్టులు గురించి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగాయి. తెలంగాణాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంబోత్సవానికి ముఖ్యమంత్రి జగన్ వెళ్లడాన్ని, విపక్ష టిడిపి సభ్యులు తప్పుపట్టడంతో వాదన మొదలైంది. దీనికి జగన్ స్పందిస్తూ తాను వెళ్లిన వెళ్ళక పోయిన తెలంగాణ లో కాళేశ్వరం ప్రారంభోత్సవం జరుగుతుందని, తాను ప్రాజెక్ట్ పూర్తి అయ్యాక వెళ్లానని, మరి ఆ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్నపుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏమి చేసాడని ప్రశ్నించారు. ఆల్మట్టి డాం ఎత్తు పెంపు ప్రస్తావన తెచ్చి చంద్రబాబు ని ఎద్దేవా చేసారు, గోదావరి నీళ్లను శ్రీశైలం కు తరలిస్తామని కెసిఆర్ చెప్పాడని, ప్రారంభోత్సవానికి వెళ్లడం తప్పేలా అవుతుందని జగన్ సమర్ధించుకున్నారు.

జగన్ వ్యాఖ్యలపై ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడుతూ, జగన్ కి తన రాజకీయ అనుభవం అంత వయసు ఉండదని, రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి ఎలా తాకట్టు పెడతాడని ప్రశ్నించారు. గతంలో జలదీక్ష సందర్బంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి అయితే తెలంగాణ, ఆంధ్ర ఇండియా పాకిస్తాన్ లాగా మారతాయని జగన్ చేసిన వ్యాఖలను గుర్తు చేసారు, కెసిఆర్ ని గతంలో జగన్ హిట్లర్ అని సంభోదించాడని , ఇప్పుడు మర్చిపోతే తానేమి చేయలేనని చెప్పారు. రెండు రాష్టాల మధ్య నీటి సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయని, టిడిపి గతంలో అనేక పోరాటాలు చేసిందని తెలిపారు, గట్టిగా మాట్లాడితే భయపడతారు అనుకోవద్దని ఐదు కోట్లమంది ఆంధ్రులు జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =